కుష్ఠు వ్యాధి రహితమే లక్ష్యం

కుష్ఠు వ్యాధి రహితమే లక్ష్యం

కుష్ఠు వ్యాధి రహితమే లక్ష్యం ప్రజాశక్తి -తిరుపతి సిటీ కుష్ఠు వ్యాధి రహిత తిరుపతి జిల్లా లక్ష్యంగా కుష్ఠు వ్యాధి రోగుల గుర్తింపు అవగాహన కార్యక్రమం అనగా లెప్రసీ కేసెస్‌ డిటెక్షన్‌ క్యాంపెయిన్‌ కార్యక్రమం తిరుపతి జిల్లాలో ఈ నెల 27వ తేదీ నుండి జనవరి 12 వరకు మొత్తం 17 రోజులు నిర్వహించ నున్నామని జిల్లా కుష్టు, ఎయిడ్స్‌, టీబీ నివారణ అధికారిని డాక్టర్‌ సి అరుణ సులోచన దేవి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా వారు వివరిస్తూ ఈ కుష్టు వ్యాధి గుర్తింపు అవగాహన కార్యక్రమం సందర్భంగా ఇంటింటికీ సచివాలయ వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది రావడం జరుగుతుందన్నారు. వారికి పూర్తి సహకారం అందించి అనుమానం ఉన్నట్లైతే పరీక్ష చేయించుకోవాల్సి ఉంటుందని, వ్యాధి నిర్ధారణ అయిన రోగులకు అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎండిటి మందులు పూర్తి ఉచితంగా అందించడం జరుగుతుందని పేర్కొన్నారు. కుష్టు వ్యాధి రహిత తిరుపతి జిల్లా లక్ష్యంగా అందరూ కలిసికట్టుగా సమన్వయంగా పనిచేసి సహకారం అందించాలని కోరారు.ప్రజల ఆరోగ్యమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం:కలెక్టర్‌ ప్రజల ఆరోగ్యమే ప్రధాన లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం డబ్ల్యూ .హెచ్‌ .ఓ . ప్రమాణాలను పాటిస్తూ అన్నిరకాల సౌకర్యాలు కల్పించిందని అందుకుతగ్గట్టు ప్రజలకు వైద్య సేవలు అందించడంలో నిమగం కావాలని కలెక్టర్‌ కె.వెంకటరమణా రెడ్డి అన్నారు. మంగళవారం ఉదయం స్థానిక జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో ప్రభుత్వ, ప్రవేట్‌ డాక్టర్లతో, స్కానింగ్‌ సెంటర్ల యాజమాన్యాలతో జిల్లా కలెక్టర్‌ అధ్యక్షతన సమావేశం నిర్వహించగా అడిషనల్‌ ఎస్‌ పి వెంకటరావు, డి ఎం హెచ్‌ ఓ తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్‌ మాట్లాడుతూ గ్రామస్థాయి నుండి జిల్లా స్థాయి ఆసుపత్రులవరకు అన్నివసతులు , మందులు , వైద్యులు వున్నారని, దాదాపు మెడికల్‌ ఉద్యోగాలు ఖాలీలు లేవని అన్నారు. సచివాలయ స్థాయిలో విలేజ్‌ హెల్త్‌ క్లినిక్స్‌ ఏర్పాటుతో సిహెచ్‌ సి లను నియమించి అందుబాటులో వుండాలని ప్రభుత్వ వసతి కల్పించేలా నిర్మిస్తున్నామని అన్నారు. గ్రామస్థాయిలోనే 7 రకల వైద్య పరీక్షలు, 105 రకాల మందులు అందుబాటులోకి వచ్చిందని అన్నారు. సదుపాయాలు వున్నాయని వైద్యసేవల్లో నిమగమై తాముచేస్తున్న వృత్తి పై సంతృప్తి చెందేలా పనిచేయడం అలవాటు చేసుకోవాలని అన్నారు. డి ఎం హెచ్‌ ఓ డాక్టర్‌ యు. శ్రీహరి పాల్గొన్నారు.

➡️