గాంధీ రోడ్‌లో ‘క్లాక్‌ టవర్‌

గాంధీ రోడ్‌లో ‘క్లాక్‌ టవర్‌’ప్రజాశక్తి- తిరుపతి టౌన్‌ స్థానిక గాంధీ రోడ్డులోని పూలమార్కెట్‌ వద్ద 125 సంవత్సరాల చరిత్ర కలిగిన గడియారం 25 సంవత్సరాల క్రితం మూగబోయింది. ఈ విషయాన్ని స్థానిక కార్పొరేటర్‌ నరసింహచారి, డిప్యూటీ మేయర్‌ భూమన అభినరు రెడ్డి దృష్టికి తీసుకువచ్చారు. దీంతో కార్పొరేషన్‌ కౌన్సిల్‌ ఆమోదంతో స్థానిక ప్రజలు, సీనియర్‌ సిటిజన్ల ఆలోచనావిధానాలకు పెద్దపీట వేస్తూ పాతతరాల జ్ఞాపకాలను భద్రపరుస్తూ నూతన గడియారం ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో స్థానిక కార్పొరేటర్‌ నరసింహచారి , ఇతర వైఎస్సార్సీపీ నాయకులు పాల్గొన్నారు.

➡️