గోవర్థన్‌ రెడ్డికి డాక్టరేట్‌

గోవర్థన్‌ రెడ్డికి డాక్టరేట్‌

గోవర్థన్‌ రెడ్డికి డాక్టరేట్‌ ప్రజాశక్తి – క్యాంపస్‌ : శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలోని వాణిజ్య శాస్త్ర విభాగపు పరిశోధక విద్యార్థి వి గోవర్ధన్‌ రెడ్డికి డాక్టరేట్‌ ప్రదానం చేసినట్లు పరీక్షల నియంత్రణాధికారి ఏం దామ్లా నాయక్‌ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. కామర్స్‌ విభాగపు ప్రొఫెసర్‌ డా. పీ.వీ. నర్సయ్య మార్గదర్శకత్వంలో ”మేనేజ్మెంట్‌ ఆఫ్‌ వర్కింగ్‌ క్యాపిటల్‌ ఇన్‌ సెలెక్ట్‌ సిమెంట్‌ కంపెనీస్‌ ఇన్‌ ఆంధ్ర ప్రదేశ్‌” అనే అంశంపైన పరిశోధనా గ్రంథాన్ని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంకు సమర్పించినట్లు తెలిపారు. పరిశోధనా సమయంలో పలు జాతీయ సెమినార్లలో పాల్గొని పరిశోధనా పత్రాలను సమర్పణలు చేశారు. పలు పరిశోధనా పత్రాలను జాతీయ, అంతర్జాతీయ పత్రికలలో ప్రచురిం చారు. వి. గోవర్ధన్‌ రెడ్డికి డాక్టరేట్‌ రావడం పట్ల పలువురు ఆచార్యులు, పరిశోధ కులు, బంధుమిత్రులు అభినందనలు తెలిపారు.

➡️