జగనన్న పాలనలోనే అభివృద్ధి, సంక్షేమ పథకాలుగడప గడపకు మన ప్రభుత్వంలో మంత్రి ఆర్‌కెరోజా

జగనన్న పాలనలోనే అభివృద్ధి, సంక్షేమ పథకాలుగడప గడపకు మన ప్రభుత్వంలో మంత్రి ఆర్‌కెరోజా

జగనన్న పాలనలోనే అభివృద్ధి, సంక్షేమ పథకాలుగడప గడపకు మన ప్రభుత్వంలో మంత్రి ఆర్‌కెరోజా ప్రజాశక్తి- పుత్తూరు టౌన్‌ : రాష్టంలో జగనన్న ప్రభుత్వంలోనే అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు అవుతున్నాయని రాష్ట్ర పర్యాటక, సాంస్కతిక, యువజన సర్వీసుల, క్రీడా శాఖ మంత్రి ఆర్‌కెరోజా అన్నారు. వడమాలపేట మండలం పూడి గ్రామ సచివాలయం పరిధిలో కాయం, కాయంపేటలో గడప గడపకు మన ప్రభుత్వంను బుధవారం మంత్రి నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలోని పేద ప్రజలకు లబ్ధి చేకూర్చాలనే లక్ష్యంతోనే రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలు తీసుకొచ్చిందని వివరించారు. అర్హత ఉన్న ప్రతి కుటుంబానికీ ఎలాంటి సిఫారసు లేకుండా సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు. ఈ సందర్భంగా సచివాలయం పరిధిలో ప్రతి ఇంటికి వెళ్లి స్థానికులను ఆప్యాయంగా పలకరించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాల ద్వారా చేకూరిన లబ్దిని, పథకాల అమలులో ఎలాంటి లోటుపాట్లు లేక అందుతున్నాయా?’ అని అడిగి తెలుసుకున్నారు. స్థానికుల సమస్యలను అధికారులు ఎప్పటికప్పుడు తెలుసుకొని సత్వరమే పరిష్కరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వడమాలపేట ఎంపీపీ విజయలక్ష్మి, వైస్‌ ఎంపీపీలు, సర్పంచులు, ఎంపీటీసీలు, సచివాలయం కన్వీనర్‌, మండల కన్వీనర్‌, స్టేట్‌ డైరెక్టర్లు, ఆలయ కమిటీ చైర్మన్లు, డైరెక్టర్లు, కో ఆప్షన్‌ సభ్యులు, మండల అధికారులు, సచివాలయ సిబ్బంది వాలంటీర్లు పాల్గొన్నారు.

➡️