జిల్లా కొత్త కలెక్టర్‌గా లక్ష్మీషా

Jan 28,2024 23:07
జిల్లా కొత్త కలెక్టర్‌గా లక్ష్మీషా

ప్రజాశక్తి- తిరుపతి టౌన్‌: తిరుపతి జిల్లా నూతన కలెక్టర్‌గా లక్ష్మీషా నియమితులయ్యారు. ఆయన ప్రస్తుతం ఏపీ స్టేట్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ ఎండీగా ఉన్నారు. ఇప్పటి వరకు తిరుపతి కలెక్టర్‌గా పనిచేసిన వెంకట రమణారెడ్డిని హౌసింగ్‌ కార్పొరేషన్‌ ఎండీగా బదిలీ చేశారు. తిరుపతి జిల్లా ఏర్పడిన తర్వాత తొలి కలెక్టర్‌గా వెంకట రమణారెడ్డిని నియమించిన విషయం తెలిసిందే. రెండు సంవత్సరాలు పాటు కలెక్టర్‌ వెంకట రమణారెడ్డి తిరుపతి జిల్లాలో పనిచేశారు. వెంకట రమణారెడ్డి 2022 సంవత్సరం ఏప్రిల్‌ ఒకటో తేదీన తిరుపతి జిల్లా ఏర్పాటైన తర్వాత మొదటి కలెక్టర్‌గా పనిచేసి ప్రస్తుతం బదిలీ అయ్యారు.

➡️