జేసీ శుభం భన్సల్‌ బాధ్యతలు స్వీకరణ

Dec 23,2023 22:10
జేసీ శుభం భన్సల్‌ బాధ్యతలు స్వీకరణ

ప్రజాశక్తి – తిరుపతి టౌన్‌ తిరుపతి జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ శుభం భన్సల్‌ జిల్లా కలెక్టరేట్‌లో శనివారం బాధ్యతలు స్వీకరించారు. 2020 ఐఎఎస్‌ బ్యాచ్‌ కు చెందిన వీరు తొలి పోస్టింగ్‌ రంపచోడవరం సబ్‌ కలెక్టర్‌ గా విధులు చేపట్టి పలు రకాల ప్రజా సమస్యలను సమర్థవంతంగా పరిష్కరించారు. ఈ సందర్భంగా జెసి మాట్లాడుతూ తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారు కొలువైన తిరుపతి జిల్లాలో జెసి గా పని చేయడం తన అదష్టంగా భావిస్తున్నానని, ప్రజా సమస్యల పరిష్కారానికి కషి చేస్తానని, ప్రభుత్వ ప్రాధాన్యత అంశాలను సమర్థవంతంగా అమలు చేయడానికి, ఎన్నికలు పారదర్శకంగా సజావుగా జరుపుటలో తన వంతు కషి చేస్తానని తెలిపారు. పలు రెవెన్యూ అంశాలపై జెసి అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అధికారి పెంచల కిషోర్‌, ఎస్డిసి శ్రీనివాసరావు,కలెక్టరేట్‌ ఎఓ జయరాములు, కలెక్టరేట్‌ సిబ్బంది తదితరులు నూతన జెసి కి శుభాకాంక్షలు తెలిపారు.

➡️