టిటిడి పాలకమండలి అవినీతి మయం: కాంగ్రెస్‌

టిటిడి పాలకమండలి అవినీతి మయం: కాంగ్రెస్‌

టిటిడి పాలకమండలి అవినీతి మయం: కాంగ్రెస్‌ ప్రజాశక్తి-తిరుపతి(మంగళం): టీటీడీ ధర్మకర్తల మండలి దారుణమైన అవినీతి కూపంగా మారి పోయిందని 20 శాతం కమీ షన్‌ ఇస్తే గాని పనులు జరిగే పరిస్థితి లేదని కాంగ్రెస్‌ తిరుపతి జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. మంగళవారం తిరుపతి ప్రెస్‌ క్లబ్‌ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ టీటీడీకి చెందిన ఇంజనీరింగ్‌ విభాగంలో టెండర్‌ వేయాలంటే 8 శాతం, టెండర్‌ ప్రక్రియలో పాల్గొని టెండర్‌ దక్కించుకున్న తర్వాత 12 శాతం నిధులు ఇస్తేనే పనులకు అనుమతులు ఇస్తున్నారని ఆరోపించారు. ధర్మక్షేత్రంలో ప్రతి పనికి ఓ రేటు కట్టి చివరికి స్వామివారి దర్శన టికెట్లను, గహాలను అమ్ము కుంటున్నారని తీవ్ర స్థాయిలో విమర్శిం చారు. కాంగ్రెస్‌ తిరుపతి జిల్లా మహిళా అధ్యక్షురాలుగా తేజోవతిని నియమిస్తూ నియామక పత్రాన్ని అందించారు. జిల్లాలోని కాంగ్రెస్‌ కన్వీనర్లుగా ఏడుగురిని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో రవి, గోపి, శాంతియాదవ్‌, నాగరాజు, శోభ, అబ్దుల్‌ మజీద్‌, జావేఓద్‌ పాల్గొన్నారు.

➡️