తెలుగుగంగ లీకేజీతో రోడ్డు నిర్మాణానికి ఆటంకం

తెలుగుగంగ లీకేజీతో రోడ్డు నిర్మాణానికి ఆటంకం

తెలుగుగంగ లీకేజీతో రోడ్డు నిర్మాణానికి ఆటంకంప్రజాశక్తి-తిరుపతి(మంగళం)మంగళం రవాణా శాఖ కూడలి నుండి శెట్టిపల్లి రైల్వే గేటు వరకు నిర్మించ తలపెట్టిన 80 అడుగుల రోడ్డు మార్గానికి తెలుగు గంగ పైపు లీకేజీలు అడ్డుగా మారాయి. నెల రోజులుగా రోడ్డు నిర్మించడానికి సదరు గుత్తేదారు ఈ మార్గాన్ని చదును చేస్తుంటే లీకేజీలతో పనులు ఆలస్యం అవుతున్నట్టుగా తెలుస్తోంది. పూర్తిస్థాయిలో తెలుగుగంగా పైపు లీకేజీలను అరికడితే కానీ పనులు ముందుకు సాగే పరిస్థితి కనబడటం లేదు. మంగళం తెలుగుగంగ పంప్‌ హౌస్‌ నుండి రేణిగుంటకు వెళ్లే పైపులైను అధిక లీకేజీలు ఉందని, తెలుగుగంగ అధికారులు వెంటనే స్పందించి లీకేజీలను అరికట్టాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.

➡️