నెలవలా…మజాకా..!అనూహ్యంగా తొలిజాబితాలోనే చోటు

నెలవలా...మజాకా..!అనూహ్యంగా తొలిజాబితాలోనే చోటు

నెలవలా…మజాకా..!అనూహ్యంగా తొలిజాబితాలోనే చోటుప్రజాశక్తి – సూళ్లూరుపేట సూళ్లూరుపేట టిడిపి అభ్యర్థి ఎవరనే విషయమై ఎన్నో ఊహా గానాలకు తెరదించుతూ అనూహ్యంగా ఎవరూ హించని రీతిలో నెలవల విజయశ్రీ పేరును ప్రకటించారు. డాక్టర్‌ సందీప్‌, శ్రీపతిబాబు, పనబాక కృష్ణయ్య.. ఇలా ఒకటేంటి.. పదుల సంఖ్యలో పోటీ నెలకొంది. వైసిపిలో గ్రూపు తగాదాలతో తమకు అవకాశం ఉంటుందన్న ఆశతో ఆశావాహూలు పదుల సంఖ్యలో పెరిగారు. అధినేత నారా చంద్రబాబునాయుడును ఎవరు కలిసినా నొప్పించక గోప్యంగానే ఉన్నారు. ఎవరికి సీటు ఇచ్చినా కలిసి ఐక్యంగా పనిచేయాలని చెబుతూ వచ్చారు. పార్టీ కష్ట సమయంలో నాలుగు సంవత్సరాలుగా పార్టీని బలోపేతం చేయడంలో నెలవల సుబ్రమణ్యం మొదటి విజయం సాధించాడు.వయస్సు రీత్యా తన కుమార్తెకు టిక్కెట్‌ ఇవ్వాలని అధినేతను కోరినట్లు సమాచారం. ఏదిఏమైనా నెలవల మార్క్‌ రాజకీయంతో కుమార్తెకు టిక్కెట్‌ను తెచ్చుకోగలిగారని చర్చ నడుస్తోంది.

➡️