నేతి దీపాలుఏ200ముక్కంటి సన్నిధిలో దోపిడీచోద్యం చూస్తున్న అధికారులు

నేతి దీపాలుఏ200ముక్కంటి సన్నిధిలో దోపిడీచోద్యం చూస్తున్న అధికారులు

నేతి దీపాలుఏ200ముక్కంటి సన్నిధిలో దోపిడీచోద్యం చూస్తున్న అధికారులుప్రజాశక్తి-శ్రీకాళహస్తి ముక్కంటి దర్శనార్థం శ్రీకాళహస్తీశ్వరయానికి విచ్చేసే భక్తులు నిలువు దోపిడీకి గురవుతున్నారు. బస్సు దిగడం మొదలు..స్వామి అమ్మవార్ల దర్శనం అయ్యేలోపు భక్తుల జేబులను ఖాళీ చేసేస్తున్నారు. ఆలయం వెలుపల వ్యాపారులు, లోపల దళారులు తమ హస్త లాఘవం చూపిస్తుండడంతో జేబులకు చిల్లు పడ్డాక బిక్క ముఖాలు వెయ్యడం భక్తుల వంతవుతోంది. వివరాల్లోకి పోతే…ప్రపంచ ప్రసిద్ధిగాంచిన శ్రీకాళహస్తీశ్వరాలయానికి నిత్యం వేల సంఖ్యలో భక్తులు విచ్చేస్తుంటారు. వీరిలో రెండు తెలుగు రాష్ట్రాల భక్తుల కంటే పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చే భక్తుల సంఖ్యే ఎక్కువగా ఉంటుంది. వీరినే లక్ష్యంగా చేసుకొని వ్యాపారులు, దళారులు రెచ్చిపోతున్నారు. సూపర్‌ బజార్‌ సర్కిల్‌ నుంచి, సన్నిధి వీధి వరకు రోడ్డుకి ఇరువైపులా ఏర్పడ్డ దుకాణాలు భక్తులకు నేతి దీపాలతో స్వాగతం పలుకుతున్నాయి. రెండు నేతి దీపాలు, గరికే, కర్పూరం, పసుపు దారం కలిగిన ఒక కవర్‌ ను రూ.200కు బలవంతంగా అంటగడుతున్నారు. దోషాలు పోవాలంటే.. దీపాలు వెలిగించిక తప్పదంటూ..లేకుంటే అరిష్టమంటూ భక్తులపై పరోక్షంగా బెదిరింపులకు పాల్పడుతున్నారు. దీంతో భక్తులు రూ.50 విలువ జేసే నేతి దీపాలను రూ.200కు కొనుగోలు చేయాల్సి వస్తోంది. ఆ దీపాలు కూడా కల్తీవన్న ఆరోపణలు వస్తున్నాయి. బిక్షాల గాలిగోపురం కాశీ విశ్వేశ్వర ఆలయం వద్ద ఉన్న ఊడగ చెట్టుకు పసుపు దారాలు కట్టి, అక్కడే నీతి దీపాలు వెలిగించాలన్న నిబంధన పెట్టడంతో భక్తులు చేసేదేమీ లేక నీతి దీపాలను కొనుగోలు చేయాల్సి వస్తోంది. ఆ నిబంధన పెట్టి చేస్తున్న నేతి దీపాల వ్యాపారంలో ఓ ట్రస్టు బోర్డు సభ్యుడి హస్తము ఉన్నట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. ఆయన చూసుకునే బిక్షాల గాలిగోపురం నుంచి సెల్ఫోన్ల కౌంటర్‌ వరకు ఇబ్బడి ముబ్బడిగా నేతి దీపాల విక్రయ దుకాణాలు వెలిసినట్లు బాహాటంగానే చెప్పుకుంటున్నారు. ఇష్టం లేకున్నా భగవంతుడి సెంటిమెంట్‌ చూపి వారి చేత బలవంతంగా నేతి దీపాలు కొనుగోలు చేస్తుండడంతో తమ మనోభావాలు దెబ్బతింటున్నాయని భక్తులు వాపోతున్నారు. ఆలయం వద్ద నేతి దీపాల వ్యాపారం జోరుగా సాగుతోందన్న ఆరోపణలు వస్తున్నా ఆలయాధికారులు పట్టీ పట్టనట్లు వ్యవహరిస్తుండడం విమర్శలకు తావిస్తోంది. ఆలయంలోకి అడుగుపెడితే.. దోషాలు పోతాయో? లేదో? తెలియదు గానీ, జేబులు మాత్రం ఖాళీ అవుతున్నాయని భక్తులు మండిపడుతున్నారు. ఇకనైనా ఆలయ అధికారులు స్పందించి అధిక ధరలకు నేతి దీపాలు విక్రయిస్తున్న వ్యాపారులపై చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

➡️