పవిత్రతను కాపాడే వారికే ఓటు వేయండి

Feb 25,2024 22:14
పవిత్రతను కాపాడే వారికే ఓటు వేయండి

నియోజకవర్గ టీడీపీ ఇంచార్జి బొజ్జల సుధీర్‌ రెడ్డి ప్రజాశక్తి-శ్రీకాళహస్తి : శ్రీకాళహస్తి పవిత్రతను కాపాడే నాయకుడికే రానున్న ఎన్నికల్లో ప్రజలు ఓట్లేయాలని తెలుగు ప్రొఫెషనల్‌ వింగ్‌ రాష్ట్ర అధ్యక్షురాలు తేజస్విని పిలుపునిచ్చారు. స్థానిక ఎన్వీఎస్‌ కల్యాణ మండపంలో ఆదివారం నియోజకవర్గ టీడీపీ ఇంచార్జి బొజ్జల సుధీర్‌ రెడ్డి ప్రొఫెషనల్స్‌ మీట్‌ ది లీడర్‌ కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌ రెడ్డి శ్రీకాళహస్తిని అపవిత్రం చేశారనీ, వచ్చే ఎన్నికల్లో ప్రొఫెషనల్స్‌ ఎవరు ఆయనకు ఓటేయొద్దని పిలుపునిచ్చారు. సుధీర్‌ రెడ్డి మాట్లాడుతూ శ్రీకాళహస్తి నియోజకవర్గన్ని ఆధ్యాత్మిక పట్టణంగా తీర్చిదిద్దిందీ, లా అండ్‌ ఆర్డర్‌ సక్రమంగా అమలు చేసింది బొజ్జల గోపాలకష్ణారెడ్డి అనీ, తనకు అవకాశం ఇస్తే బొజ్జల పేరు నిలబెడతామని హామీ ఇచ్చారు.

➡️