పొంచి ఉన్న తాగునీటి ఎద్దడి

Mar 31,2024 22:47
పొంచి ఉన్న తాగునీటి ఎద్దడి

ప్రజాశక్తి- తిరుపతిటౌన్‌ తిరుపతి ఆధ్మాతిక నగరానికి నీటసమస్య పొంచి ఉంది. తెలుగు గంగనీరు రోజుమార్చి రోజు సరఫరా చేసినా కేవలం 40రోజులు మించి నీళ్లు రావడం కష్టమని తెలుస్తుంది. కళ్వాణీ డ్యాంలోని నీటిని రోజుమార్చి రోజు సరఫరా చేసిన కేవలం సెప్టెంబర్‌ నెలవరకే వస్తాయి. తెలుగుగంగ, కళ్వాణి డ్యాంలలో రోజురోజుకు నీటిమట్టం తగ్గుతుంది. వేసవిలో మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఇంజనీరింగ్‌ అధికారులు, కమిషనర్‌ అదితి సింగ్‌ మధ్య సమన్వయం లేకపోవడం ఒక కారణమైతే, అధికారులు అస్లెంబీ, పార్లమెంట్‌ ఎన్నికల్లో తలమునకైలే ఉండడం వల్ల తిరుపతి ప్రజలకు దాహర్తిని పూర్తిగా విస్మరించారు. కమిషనర్‌ అదితిసింగ్‌ బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి నగరపాలక సంస్థ అభివృద్ధి గురించి పట్టించుకోకపోవడం మరో సమస్యగా మారింది. ఆమె కమిషనర్‌గా పనిచేయడం లేదని చుట్టపుచూపుగా వచ్చిన్నట్లుగా ఉందని నగరవాసులు ఆరోపిస్తున్నారు. గతంలో ఇక్కడ కమిషనర్‌లుగా పనిచేసిన వారు వేసవికాలం వచ్చిందంటే తాగునీటి సమస్యపై ముందుగా చర్యలు తీసుకునేవారు. కార్పొరేషన్‌లో విలీనమైన శెట్టిపల్లి పంచాయతీ ప్రతిరోజు తాగునీటి సమస్యతో అల్లాడుతున్నారు. ఎంఆర్‌పల్లి పంచాయతీలో కొన్ని వీధుల్లో ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. నగరంలో రోజుమార్చి రోజు 30 నుంచి 40 నిముషాలకు మించి తాగునీరు సరఫరా చేయడం లేదు. జిల్లా కలెక్టర్‌ అప్రమత్తమై తాగునీటి సమస్యపై యుద్ధప్రాతిపదిక చర్యలు తీసుకోవాలని సమావేశాలు పెడితే మన మున్సిపల్‌ కార్పొరేషన్‌ అధికారులు పరుగులు తీసున్నారు. ఎన్నికలవేళ ప్రజాప్రతినిధులను తాగునీటి సమస్యపై నిలదీస్తున్నారు. ఓటు అడిగేందుకు వీధివీధి తిరుగుతున్న రాజకీయపార్టీలకు ఈ బెడద తప్పడం లేదు. ఎన్నికలు అయ్యేవరకైయినా సక్రమంగా నీటిని సరఫరా చేయాలని, లేదంటే ఎన్నికలపై తీవ్ర ప్రభావం చూపుతుందని రాజకీయపార్టీల నేతలు ఆందోళన చెందుతున్నారు. తాజాగా మూడు రోజులకు ఒకసారి తాగునీరు సరఫరా చేస్తున్నారు. ఇంకా ప్రభుత్వ యూనివర్శిటీలు, ఆసుపత్రులకు మీటర్ల పెట్టి సరఫరా చేస్తున్నారు. నగరంలో సుమారు 3లక్షల మంది జనాభా నివాసిస్తున్నారు. తిరుపతికి రోజుకు 80వేల మంది యాత్రికులు రాకపోకలు సాగిస్తున్నారు. ప్రధాన నీటి వనరులు తిరుపతి వాసులకు తెలుగుగంగ నీళ్లు ఇవి శ్రీకాళహస్తి కైలస రిజర్వాయి నుంచి రామపురం రిజార్వాయి ద్వారా సుమారు 37కిల్లోమీటర్ల పైపులైన్‌ ద్వారా సరఫరా అవుతుంది. నగరంలో 12 ఫ్లింటర్‌ ట్యాంకులు ఉన్నాయి. వీటి ద్వారా ప్రజలకు నీటిని సరఫరా చేస్తున్నారు. దీంతోపాటు అమృత్‌ పథకంలో నిర్మించి 11ట్యాంకులు ఏర్పాటు చేసి నీటి అందిస్తున్నారు. తెలుగుగంగతోపాటు చంద్రగిరి నియోజకవర్గంలో కళ్వాణిడ్యాం ద్వారా నీటి సరఫరా చేస్తున్నారు. రామపురం రిజర్వాయి వద్ద విద్యుత్‌ సమస్యలు వస్తే తెలుగు గంగ నీళ్లు సరఫరా సమస్య ఏర్పడుతుంది. వేసవి కాలంలో మందుస్తు చర్యలు తీసుకోకపోవడం వల్లే ఈసమస్యలు వస్తున్నట్లు నగర వాసులు అంటున్నారు.రోజుకు 65ఎంఎల్‌డిలు డిమాండ్‌ తిరుపతి వాసులకు రోజుకు 65ఎంఎల్‌డిల నీరు డిమాండ్‌ ఉండగా నగరపాలక సంస్థ తెలుగుగంగ ద్వారా 40 ఎంఎల్‌డిలు, కళ్వాణిడ్యాం ద్వారా 20 ఎంఎల్‌డిలు, 534 చేతిబోర్ల ద్వారా 1.47 ఎంఎల్‌డిల నీటి అందిస్తున్నట్లు చెబుతున్నారు. మొత్తం 62ఎంఎల్‌డిలు నీటిని సరఫరా చేస్తున్నారు. 3ఎంఎల్‌డిలు తక్కువగా ఉంది. నీటి సమస్య ఉన్న డివిజన్‌లో రోజుకు 16 నీటి ట్యాంకర్ల ద్వారా పాయింట్‌ 75ఎంఎల్‌డిలు ప్రజలకు సరఫరా చేస్తున్నట్లు చెబుతున్నారు. నీటి సమస్య ఉన్న చోట్ల తాత్కాలికంగా ట్యాంకర్ల ద్వారా అందిస్తున్నారు. అమృత్‌ పథకంలో కొన్ని ట్యాంకులు నీటిని నింపడం లేదు.కొన్ని ట్యాంకులు పూర్తికావాల్సి ఉంది.చేతులెత్తేసిన కౌన్సిల్‌ అసలు తిరుపతి నగరపాలక కౌన్సిల్‌ ఉందా..? అన్న అనుమానం వస్తుంది. తాగునీటి సమస్య ఉంటే ఎందుకు రెండునెలలు క్రితం అత్యవసర సమావేశం పెట్టకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపణలు ఉన్నాయి. నగరంలో మురికి వాడ ప్రాంతాల్లో నీటసమస్య ఎక్కువ ఉంది. ఆయా ప్రాంతాంలో కొంతమంది కార్పొరేటర్లు నీటి ట్యాంకర్ల ద్వారా నీటిని అందించే కార్యక్రమం చేస్తున్నారు. మరికొన్ని మురికివాడలో మున్సిపల్‌ నీటిట్యాంకర్ల ద్వారా వస్తున్నాయి. అది కూడా కనీసం పది బిందెలు నీరు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్‌ ట్యాంకర్లు ఎక్కువ మధ్యాహ్నం పూట రావడంతో అంత ఎండలు మహిళాలు నీటికోసం తిరిగి తిరిగి వడదెబ్బకు గురివుతున్నారు. నీటి సమ్యస ఉన్న డివిజన్‌లో చాలామంది ప్రైవేట్‌ నీటి ట్యాంకర్లు తొలుకుంటున్నారు. ప్రైవేట్‌ ట్యాంకర్ల యజమానులు రూ.1000లు నుంచి 5వేలు తక్కువ లేకుండా వసూళు చేస్తున్నారు. ముఖ్యంగా అపార్టుమెంట్‌ వాసులు, వ్యాపార సముదాయం కలిగిన వారు తప్పకుండా కొనుగోలు చేయాల్సి వస్తోంది.నీటి సమస్య లేకుండా చర్యలు..- మోహన్‌, ఎస్‌ఇ వేసవిలో తాగునీటి సమస్య లేకుండా చర్యలు తీసుకుంటామని మన్సిపల్‌ కార్పొరేషన్‌ ఇంజనీరింగ్‌ సూపరింటెండెంట్‌ టి.మోహన్‌ తెలిపారు. తెలుగుగంగ నీటిని పంపింగ్‌ చేసుకోవడానికి చర్యలు చేపట్టమని చెప్పారు. రామాపురం వద్ద విద్యుత్‌ సరఫరా సమస్య వచ్చి తెలుగుగంగ నీటికి అంతరాయం కలిగిందని దాని వల్లే ఈసమస్య అని పేర్కొన్నారు. విద్యుత్‌ సమస్య ఏర్పడకుండా ఉండేందుకు ఎస్‌పిడిసిఎల్‌ అధికారులతో సంప్రదించిన్నట్లు చెప్పారు.

➡️