ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులతోనే ఆరోగ్యం

ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులతోనే ఆరోగ్యం

ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులతోనే ఆరోగ్యం ప్రజాశక్తి – రామచంద్రాపురం ప్రకృతి వ్యవసాయంతో తయారుచేసిన ఆహార ఉత్పత్తులతోనే ప్రతి ఒక్కరూ సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందవచ్చని నాబార్డ్‌ జిల్లా అభివద్ధి మేనేజర్‌ సి.సునీల్‌ అన్నారు. బుధవారం సి రామాపురంలో నాబార్డ్‌ ఆర్థిక సహాయముతో నూతనంగా ఏర్పాటు చేసిన నారీ రూరల్‌ మార్ట్‌ను సి సునీల్‌, ప్రకతి వ్యవసాయ శాఖ డిపిఎం షణ్ముగం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రసాయనిక ఎరువులకు స్వస్తిపలికి సేంద్రియ వ్యవసాయ పద్ధతులతో సాగుచేసిన పంటలను ఆహారంగా తీసుకోవడం ద్వారా ఆరోగ్యంగా ఉండగలమన్నారు. నారీ స్వచ్ఛంద సంస్థ నిర్వహిస్తున్న నాబార్డ్‌ రూరల్‌ మార్ట్‌ లో లభ్యమయ్యే ప్రకతి వ్యవసాయ ఆహార ఉత్పత్తులను మండల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. రామాపురంలో నాబార్డ్‌ సౌజన్యంతో నారీ స్వచ్చంద సంస్థ కేంద్రాన్ని ఏర్పాటు చేశామని ఆ సంస్థ కార్యదర్శి రజిని అన్నారు. నాబార్డు రూరల్‌ మార్ట్‌ లో లభ్యమయ్యే ఆహార ఉత్పత్తులను ఆమె వివరించారు. ప్రకృతి వ్యవసాయ శాఖ అడిషనల్‌ డీపీఎం పట్టాభిరెడ్డి, ఏపీ మాస్‌ డైరెక్టర్‌ వినాయక రెడ్డి ,ఏవో స్రవంతి, నారీ స్వచ్చంద సంస్థ అధ్యక్షులు గోపాల్‌ రెడ్డి, ఎఫ్‌ పీఓ డైరెక్టర్స్‌ పాల్గొన్నారు.

➡️