మార్క్స్‌ సిద్దాంతాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి

Mar 14,2024 22:16
మార్క్స్‌ సిద్దాంతాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి

ప్రజాశక్తి – తిరుపతి టౌన్‌, యంత్రాంగం దోపిడీ లేని సమాజ నిర్మాణానికి మార్క్సిజమే ఆయుధమని, ఈ సిద్ధాంతాన్ని ప్రజల్లోకి విస్తారంగా తీసుకెళ్లాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు అన్నారు. మార్క్స్‌ 141వ వర్థంతి పురస్కరించుకుని తిరుపతి యశోదానగర్‌లో నివాళి అర్పించారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కార్పొరేట్లకు ఊడిగం చేస్తూ, ప్రజలను దోచుకుంటోందని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో మతోన్మాద బిజెపిని ఓడించడమే లక్ష్యంగా సిపిఎం శ్రేణులు విస్తారంగా ప్రచారం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు కందారపు మురళి, టి.సుబ్రమణ్యం, కె.వేణుగోపాల్‌ పాల్గొన్నారు. గూడూరు టౌన్‌లో… సిపిఎం కార్యాలయంలో మార్క్స్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ప్రపంచ గమనాన్ని మార్చిన కారల్‌ మార్క్స్‌ సిద్ధాంతంపై ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. సిపిఎం నాయకులు జోగి శివకుమార్‌, బివి రమణయ్య, సురేష్‌, టి.వెంకట రామిరెడ్డి, బి.చంద్రయ్య, అడపాల ప్రసాద్‌ పాల్గొన్నారు. నాయుడుపేటలో… వేదనపర్తి సుందర రామిరెడ్డి భవన్‌ సిఐటియు కార్యాలయంలో నాయకులు శివకవి ముకుంద ఆధ్వర్యంలో నివాళి అర్పించారు. మానవ చరిత్ర మలుపుల గుట్టు విప్పిన మహోన్నతుడు కారల్‌మార్స్‌ అని అన్నారు. మానవశ్రమే అన్నింటికీ మూలమని, మానవత్వాన్ని గౌరవించాలని అన్నారు. నాయకులు చంద్రకళ, విజయలక్ష్మి, వేలు, సుధాకర్‌, ఎన్‌.ముకుంద, ప్రతాప్‌ పాల్గొన్నారు.

➡️