ముక్తిదామం ప్రారంభించడం ఆనందదాయకం-ఎమ్మెల్యే బియ్యపు మధుసూదనరెడ్డి

ముక్తిదామం ప్రారంభించడం ఆనందదాయకం-ఎమ్మెల్యే బియ్యపు మధుసూదనరెడ్డి

ముక్తిదామం ప్రారంభించడం ఆనందదాయకం-ఎమ్మెల్యే బియ్యపు మధుసూదనరెడ్డిప్రజాశక్తి-శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తిలో హిందువుల కోసం నిర్మించిన ముక్తిదామం ప్రారంభించడం ఆనందంగా ఉందని శాసనసభ్యులు బియ్యపు మధుసూదనరెడ్డి అన్నారు. శ్రీకాళహస్తి పట్టణ నడిబొడ్డున ప్రవహించే స్వర్ణముఖినది ఒడ్డున పురపాలక సంఘం సాధారణ, 14, 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.3.10కోట్లతో నిర్మించిన కైలాస ముక్తిదామాన్ని తిరుపతి పార్లమెంటు సభ్యులు మద్దిల గురుమూర్తితో కలసి సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా బియ్యపు మధుసూదనరెడ్డి మాట్లాడుతూ… జంగమయ్య కొలువైన శ్రీకాళహస్తిలో హిందువులకు స్మశాన వాటిక లేకపోవడం తనను ఎంతో బాధించేదన్నారు. అందుకే తాను శాసనసభ్యుడు అయిన వెంటనే కైలాస ముక్తిదామం నిర్మించాలని నిర్ణయించుకున్నానన్నారు. అందులో భాగంగానే మొదటి దశలో రూ.2.50కోట్లు వెచ్చించి ఈ ముక్తిదామం నిర్మించామన్నారు. ఇక నాలుగు దశల్లో రూ.26కోట్లు వెచ్చించి కైలాస ముక్తిదామం ఆధునీకరించి అన్ని వసతులు కల్పిస్తామన్నారు. ఇకపై శ్రీకాళహస్తిలో ఎవరు మతి చెందిన వారి దహనసంస్కారాలకు కావలసిన ఖర్చు తానే భరిస్తానన్నారు. ఇంతకాలం హిందువులకు స్మశాన వాటిక లేక పోవడంతో అనేక ఇబ్బందులు పడేవారన్నారు. ఇకపై ఆ సమస్య ఉండదన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీఎస్‌ ఆర్టీసీ ఛైర్మన్‌ మిద్దెల హరి, ఆర్డీవో రవిశంకర్‌ రెడ్డి, పురపాలక సంఘం కమిషనరు రమేష్‌ బాబు, తహసీల్దారు జనార్థన రాజు, వైసీపీ నేతలు శ్రీవారి సురేష్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️