మెనూ అమలు చేయకుంటే చర్యలు మధ్యాహ్న భోజనం తనిఖీలో ఎంఇవో

మెనూ అమలు చేయకుంటే చర్యలు మధ్యాహ్న భోజనం తనిఖీలో ఎంఇవో

మెనూ అమలు చేయకుంటే చర్యలు మధ్యాహ్న భోజనం తనిఖీలో ఎంఇవో ప్రజాశక్తి -దొరవారిసత్రం: ప్రభుత్వం అమలు చేస్తున్న మధ్యాహ్న భోజనంలో మెనూ పాటించకుంటే చర్యలు తప్పవని ఎంఇవో 2 హెచ్చరించారు. మండల పరిధిలోని టపా ఇండ్లలోని ప్రాథమిక పాఠశాలను ఎంఈఓ- 2 సిహెచ్‌ కష్ణయ్య సోమవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలకు సంక్రాంతి సెలవులు ఇచ్చిన తర్వాత పాఠశాలలో మొదటి రోజు ప్రారంభం కావడంతో పాఠశాలను పరిశీలించి రికార్డులు తనిఖీ చేశారు. పిల్లల విద్యా విధానం గురించి విద్యార్థులను అడిగి తెలుసు కున్నారు. అనంతరం మధ్యాహ్నం పూట అమలు చేస్తున్న జగనన్న గోరుముద్దను పరిశీలించి విద్యార్థులతో భోజనం రుచి చూశారు. మెనూ ప్రకారం భోజనంను అమలు చేయకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. వీరితో పాటు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పాల్గొన్నారు.

➡️