మెరుగైన జీవన ప్రమాణలు అందించేందుకే పార్కులు

Feb 15,2024 21:55
మెరుగైన జీవన ప్రమాణలు అందించేందుకే పార్కులు

రూ.80 లక్షలతో నిర్మించిన వైఎస్సార్‌ తుడా పార్కును ప్రారంభించిన మంత్రి రోజాప్రజాశక్తి- నగరి: వినోదంతోపాటు మెరుగైన జీవన ప్రమాణాలు అందించేందుకే పార్కులు నిర్మించినట్లు రాష్ట్ర పర్యాటక, సాంస్కతిక, యువజన సర్వీసుల, క్రీడాశాఖ మంత్రి ఆర్కే రోజా అన్నారు. గురువారం కుశస్థలీ నదిగట్టున ఆహ్లాదకరంగా సిద్దం చేసిన డాక్టర్‌ వైఎస్సార్‌ తుడా పార్కును ఆమె ప్రారంభించారు. పార్కులో ఏర్పాటు చేసిన మహానేత విగ్రహాన్ని ఆవిష్కరించి పూలదండ వేసి నివాళులర్పించారు. చిన్నారుల ఆటల పరికరాలు, వాకింగ్‌కు సిద్దం చేసిన మెడికేటెడ్‌ రాళ్ల ట్రాక్‌, విన్నూత్నంగా నాటిన మొక్కలు, పచ్చదనం ఉట్టిపడే పచ్చిక మైదానాలను స్థానిక నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆమె పరిశీలించారు. పార్కులో ఆటలాడుకున్న చిన్నారులతో కాసేపు ముచ్చటించారు. ప్రతిరోజు పార్కులో కాసేపు ఆడుకుంటే ఆనందంతో పాటు ఆరోగ్యం వస్తుందని వారికి సూచించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ నగరి మున్సిపాలిటీ 2005లో ఏర్పడితే ఇప్పటివరకు ఏ నాయకులు పార్కును ఏర్పాటు చేయలేక పోయారన్నారు. ఉద్యోగ, వత్తి రీత్యా ఒత్తిల్లకు గురైన వారు, వయో వద్దాప్యంలో ఆహ్లాదకరమైన ప్రాంతంలో సేదతీరాలనుకున్న వారు, ఉదయం పూట వాకింగ్‌ చేయదలచినవారు పార్కు కోసం ఎదురు చూస్తారన్నారు. అందుకే రూ.80లక్షల నిధులతో డాక్టర్‌ వైఎస్సార్‌ తుడా పార్కును ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. పార్కులు ఆహ్లాదాన్ని పంచడంతో పాటు పట్టణ ప్రమాణాలను పెంచుతుందన్నారు. ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పుత్తూరులో రూ. 1.10కోట్ల వ్యయంతో మున్సిపల్‌ పార్కు ఏర్పాటు చేయడంతో పాటు రూ.24లక్షల వ్యయంతో చిల్డ్రన్‌ పార్కుకు ప్రహరీగోడ నిర్మిస్తున్నామన్నారు. రూ.39.5లక్షల వ్యయంతో వడమాలపేటలో తుడాపార్కు ప్రారంభించడం జరిగిందన్నారు. పార్కును నగరి ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. మున్సిపల్‌ చైర్మన్‌ పీజీ నీలమేఘం, వైస్‌చైర్మన్లు బాలన్‌, వెంకటరత్నం రెడ్డి, మున్సిపల్‌ కమిషనర్‌ మంజునాథ్‌ గౌడ్‌, తుడా డీఈ కష్ణారెడ్డి, మున్సిపల్‌ కౌన్సిలర్లు, కోఆప్షన్‌ సభ్యులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

➡️