మోకాళ్లపై మున్సిపల్‌ కార్మికుల నిరసన

మోకాళ్లపై మున్సిపల్‌ కార్మికుల నిరసన

మోకాళ్లపై మున్సిపల్‌ కార్మికుల నిరసనప్రజాశక్తి – గూడూరు టౌన్‌ ఏ.పి.మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ (సి.ఐ.టి.యు) అనుబంధం ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటి ఇచ్చిన పిలుపుమేరకు తిరుపతి జిల్లా గూడూరులో బుధ వారానికి పారిశుద్య కార్మికుల నిరవధిక సమ్మె 9వ రోజుకు చేరుకుంది. నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలను వెంటనే అమలు చేయాలని, కాలయాపన చేస్తే సమ్మెను ఉధతం చేస్తామని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు బివి రమణయ్య, సురేష్‌, కమిటి సభ్యులు సుబ్బమ్మ, పెంచలమ్మ, నారాయణమ్మ, పద్మమ్మ, మణెమ్మ, మణి, శ్రీనివాసులు, నాగరాజు పెంచలయ్య పాల్గొన్నారు.గూడూరులో చీపురు పట్టిన మున్సిపల్‌ కమిషనర్‌మున్సిపల్‌ కమిషనర్‌ చీపురు పట్టారు. బుధవారం వేకువజామున రైల్వే స్టేషన్‌ నుండి సంగం థియేటర్‌ సెంటర్‌ వరకూ కిలో మీటర్‌ పైగా ప్రధాన రహదారిపై చెత్తచెదారం తొలగించారు. ఆయనతోపాటు మున్సిపల్‌ కార్యాలయ అధికారులు, సిబ్బంది 30 మంది వరకూ శ్రమదానంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మున్సిపల్‌ కమిషనర్‌ మిటికిరి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ పది రోజులుగా పారిశుద్ధ్య కార్మికులు సమ్మెలో ఉన్నారన్నారు. ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు సహకరించాలని కోరారు. సమ్మెలో ఉన్న కార్మికులు స్వచ్ఛందంగా వస్తున్న ప్రయివేటు కార్మికులకు అడ్డుపడకూడదన్నారు. సమ్మెకు తాము వ్యతిరేకం కాదన్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా గూడూరులో తనతోపాటు మున్సిపల్‌ అధికారులు, సిబ్బంది, సచివాలయ కార్యదర్శులు రైల్వే స్టేషన్‌ నుండి సంగం థియేటర్‌ వరకూ ఒక కిలో మీటర్‌ వరకూ రోడ్డుపై ఉన్న చెత్తను ఊడ్చారన్నారు.- సూళ్లూరుపేటలో కార్మికులు, కౌన్సిలర్లు మధ్య వాగ్వివాదం జరిగింది. మున్సిపల్‌ ఛైర్మన్‌ దబ్బల శ్రీమంత్‌రెడ్డి,కమిషనర్‌ నరరేంద్రకుమార్‌ ఆధ్వర్యంలో మున్సిపల్‌ వైస్‌ఛైర్మన్‌ చిన్ని సత్యనారాయణ, కౌన్సిలర్‌ పోలూరు పద్మలు బుధవారం సాయంత్రం బజారువీధిలో చెత్త తీయడానికి రావడంతో కార్మికులు అడ్డుకున్నారు. పోలీసుల సమక్షంలో మున్సిపల్‌కౌన్సిలర్లు, కార్మికుల మధ్య వివాదం చోటుచేసుకుంది. తమ సమస్యలు తీరే వరకూ ఇలాంటి పనులు చేయరాదని మున్సిపల్‌ కార్మికులు, సిఐటియు నాయకులు అధికారులను అడ్డుకున్నారు. పోటీ కార్మికులను పెట్టరాదని షార్‌ డైరెక్టర్‌కు వినతిపత్రం అందించారు. సిఐటియు కార్యదర్శి కె.లక్ష్మయ్య మాట్లాడుతూ మున్సిపల్‌ కార్మికులు శాంతియుతంగా ఆందోళన చేస్తుంటే, అధికారులు రెచ్చగొట్టడం సబబు కాదన్నారు. కార్మికులు పోరాడుతుంటే షార్‌ కాంట్రాక్టర్లు విచ్ఛిన్నం చేయడం సబబు కాదన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు రమణయ్య, కె.సాంబశివయ్య, బి.పద్మనాభయ్య, చంద్రశేఖర్‌, సిహెచ్‌ సుధాకర్‌రావు, పి.మనోహరం, సుంకర అల్లెయ్య పాల్గొన్నారు.- పుత్తూరు టౌన్‌లో కనీస వేతనం 26వేలివ్వాలని ఎఐటియుసి మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ గౌరవాధ్యక్షులు డి.మహేష్‌ డిమాండ్‌చేశారు. హెల్త్‌ అలవెన్స్‌ ఆరువేలతో పాటు, కనీస వేతనం 20వేలివ్వాలన్నారు. అంకయ్య, యాకోబ్‌, విజరుకుమార్‌ పాల్గొన్నారు.

➡️