యువత చేతిలోనే దేశ భవిష్యత్‌ఃఆదిశంకరః గ్రాడ్యుయేషన్‌ డేలోజెఎన్‌టియు వైస్‌ ఛాన్స్‌లర్‌ రంగా జనార్థన్‌.

యువత చేతిలోనే దేశ భవిష్యత్‌ఃఆదిశంకరః గ్రాడ్యుయేషన్‌ డేలోజెఎన్‌టియు వైస్‌ ఛాన్స్‌లర్‌ రంగా జనార్థన్‌.

యువత చేతిలోనే దేశ భవిష్యత్‌ఃఆదిశంకరః గ్రాడ్యుయేషన్‌ డేలోజెఎన్‌టియు వైస్‌ ఛాన్స్‌లర్‌ రంగా జనార్థన్‌.ప్రజాశక్తి – గూడూరు టౌన్‌ : దేశ భవిష్యత్తు యువత చేతిలోనే ఉందని ప్రధాని నరేంద్ర మోడీ భావిస్తున్నట్లు భారతదేశం విశ్వ గురువుగా రూపాంతరం చెందాలంటే యువతపైనే ఆధారపడి ఉందని అనంతపురం జేఎన్‌టియు వైస్‌ ఛాన్స్‌లర్‌ రంగా జనార్థన్‌ సూచిం చారు. సోమవారం తిరుపతి జిల్లా గూడూరు పట్టణ పరిధిలోని ఆదిశంకర ఇంజనీరింగ్‌ కళాశాలలో ఏడవ గ్రాడ్యుయేషన్‌ డేను మంగళ వారం నిర్వహించారు. గూడూరు పట్టణ పరిధిలోని ఆదిశంకర ఇంజనీరింగ్‌ కళాశాలలో నిర్వహించిన ఏడవ గ్రాడ్యుయేషన్‌ డేలో విద్యార్థులకు సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న జెఎన్‌టియు అనంతపురం విసి రంగా జనార్థన్‌ మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా ఇంజనీరింగ్‌ రంగంలో భారతదేశం ప్రత్యేక స్థానం సాధించిందన్నారు. ఇంజనీరింగ్‌ విద్యార్థులు వారిలోని నైపుణ్యాలను ప్రదర్శించి దేశ అభివద్ధికి తోడ్పడాలని సూచించారు. ఆది శంకర విద్యాసంస్థల వ్యవస్థాపకులు వంకి పెంచలయ్య మాట్లాడుతూ దేశ భవిష్యత్తును తీర్చిదిద్దే ఇంజనీర్లుగా తమ కళాశాల నుండి విద్యార్థులు అనేక నైపుణ్యాలతో బయటకు వెళ్లడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్‌ మోహన్‌, ప్రిన్సిపాల్‌ ధనుంజయ, హెచ్‌వోడిలు విద్యార్థిని విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు

➡️