రంగంపేటలో రంకేసిన కోడిగిత్తలుచెదురు మదుర సంఘటనలతో పలువురికి స్వల్పగాయాలు

రంగంపేటలో రంకేసిన కోడిగిత్తలుచెదురు మదుర సంఘటనలతో పలువురికి స్వల్పగాయాలు

రంగంపేటలో రంకేసిన కోడిగిత్తలుచెదురు మదుర సంఘటనలతో పలువురికి స్వల్పగాయాలు పజాశక్తి రామచంద్రపురం (చంద్రగిరి): రంగంపేటలో జల్లికట్టు జోరుగా సాగింది. మంగళవారం ఏ రంగంపేటలో పోలీసు అంక్షలను బేఖాతారు చేస్తూ కోడెగిత్తల పరుష పందాలు అంగరంగ వైభవంగా జరిగాయి. సంక్రాంతి పర్వదినాలలో భాగంగా మూడో రోజు కనుమ పండుగ సందర్భంగా కోడె గిత్తల పరుష పందాలు నిర్వహించటం ఆనవాయితీ. రైతు కుటుంబాలను అన్నివిధాల ఆదుకుంటున్న కోడెగిత్తలు ఆవుల కొమ్ములకు రంగులు వేసి వాటిని శుభ్రంగా కడిగి కనుమ పండుగ రోజున పూజిస్తారు. ఈనేపథ్యంలోనే కోడేగిత్తలకు పలకలు కట్టి బరిలోకి దించుతారు. అప్పటికే మండలం నుండే కాకుండా చుట్టుపక్కల మండలాలు, జిల్లాల నుండి వచ్చిన యువత గుంపులు గుంపులుగా చేరి వాటికి కట్టిన నగదు పలకలను చేజికిచ్చేందుకు పోటీపడ్డారు. పశువుల పాక నుండి బరిలోకి దించి కోడెగిత్తలు వెనక డప్పులు వాయిస్తూ వాటిని బెదరకొట్టగా అవి బెదిరి దూకుడుగా పరిగెత్తుతుండగా యువకులు వాటికి కట్టిన పలకలను చేజిక్కించేదకు పోటీపడ్డారు. ఈ పోటీలో కొంతమంది యువకులకు స్వల్ప గాయాలయ్యాయి. పరుష పందాలను తిలకించేందుకు విచ్చేసిన జనాలతో ఏ రంగంపేట జనసంద్రమైంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన యువత జట్లుగా ఏర్పడి కోడె గిత్తలకు కట్టిన పలకలను చేజిక్కించుకున్న ఆనందంతో ఎగిరి గంతులు వేయడం జరిగింది. పరుష పందాలకు విచ్చేసిన జనానికి స్థానికులు అన్న పానీయాలను ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.

➡️