రేపు గ్రూప్‌ 2 పరీక్షలు ఉదయం 10.30- 1 గంట వరకూ మొత్తం 27,961 మంది అభ్యర్థులు

రేపు గ్రూప్‌ 2 పరీక్షలు ఉదయం 10.30- 1 గంట వరకూ మొత్తం 27,961 మంది అభ్యర్థులు

రేపు గ్రూప్‌ 2 పరీక్షలు ఉదయం 10.30- 1 గంట వరకూ మొత్తం 27,961 మంది అభ్యర్థులుప్రజాశక్తి – తిరుపతి టౌన్‌ ఈనెల 25న ఆదివారం నిర్వహించే గ్రూప్‌ 2 పరీక్షల్లో ఎలాంటి చిన్న పొరబాట్లు జరగకుండా విజయవంతంగా నిర్వహించాలని కలెక్టర్‌ డాక్టర్‌ జి.లక్ష్మిశ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో డిఆర్‌ఒ పెంచల కిషోర్‌, విభాగం అడిషనల్‌ సెక్రటరీ వెంకటలక్ష్మితో కలిసి సమీక్ష నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ గ్రూప్‌ 2 పరీక్ష ఆదివారం ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకూ ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీసు కమిషన్‌ ద్వారా జరుగుతుందన్నారు. తిరుపతి జిల్లాలో తిరుపతి, చంద్రగిరి, రేణిగుంట, శ్రీకాళహస్తి, పుత్తూరు, కోట, గూడూరు మండల కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 61 సెంటర్లలో 27,894 మంది గ్రూప్‌ 2 పరీక్షలకు హాజరుకానున్నారని తెలిపారు. 31 మంది రూట్‌ ఆఫీసర్లుగాను, 61 మంది తహశీల్దార్లు, ఎంపిడిఒలను లయిజాన్‌ ఆఫీసర్లుగానూ, 61 చీఫ్‌ సూపరింటెండెంట్లను ఆయా కళాశాల ప్రిన్సిపాల్స్‌ను నియమించడం జరిగిందన్నారు. పరీక్షా కేంద్రాలకు హాల్‌టిక్కెట్‌తో పాటు ఏదైనా గుర్తింపు కార్డు తీసుకురావాలన్నారు.

➡️