లెక్కలు లేని నగదు స్వాధీనం

లెక్కలు లేని నగదు స్వాధీనం

లెక్కలు లేని నగదు స్వాధీనంప్రజాశక్తి – గూడూరు టౌన్‌ : ఎలాంటి లెక్కలు లేకుండా బస్సులో తరలిస్తున్న 55 లక్షలా 87 వేల 80 రూపా యలను సీజ్‌ చేసి విచారి స్తున్నామని డిఎస్‌పి సూర్య నారాయణ రెడ్డి తెలిపారు. గూడూరులోని గ్రామీణ పోలీస్‌ స్టేషన్‌లో డీఎస్పీ సూర్య నారాయణ రెడ్డి ఆదివారం మీడియా సమా వేశం నిర్వహించారు. పట్టుబడ్డ 55లక్షలా 87వేలా80 రూపాయల నగదును మీడియాకు చూపారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ హైదరాబాద్‌ నుండి చెన్నై వైపు వెళ్లే ట్రావెల్‌ బస్సులో నగదు వెళుతోందని అందిన సమా చారం మేరకు పోలీసులు గూడూరు సమీపంలోని జాతీయ రహదారిపై తనిఖీలు చేపట్టగా 55 లక్షలా 87వేల 80 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నా రన్నారు. నగదుతో పాటు ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని తెలిపారు. బస్సు బెడ్‌ల కింద ఉంచిన నగదును గుర్తించామని పేర్కొన్నారు. పట్టుబడ్డ నగదుకు ఎలాంటి పత్రాలు లేవని, అందుకే సీజ్‌ చేశామన్నారు. బంగారం కొనుగోలుకు కోసం చెన్నైకు వెళుతున్నట్లు సంబధిత వ్యక్తులు తెలిపారన్నారు. ఈ సమావేశంలో రూరల్‌ సిఐ దశరథ రామారావు, సిబ్బంది పాల్గొన్నారు. 1…

➡️