వంటావార్పుతో వ్యవసాయ కళాశాల కార్మికుల నిరసనఐదో రోజు నిరవధిక సమ్మె

వంటావార్పుతో వ్యవసాయ కళాశాల కార్మికుల నిరసనఐదో రోజు నిరవధిక సమ్మె

వంటావార్పుతో వ్యవసాయ కళాశాల కార్మికుల నిరసనఐదో రోజు నిరవధిక సమ్మెప్రజాశక్తి – క్యాంపస్‌ కనీస వేతనం ఇవ్వాలన్న ప్రధాన డిమాండ్‌తో వ్యవసాయ కళాశాల కాంట్రాక్టు కార్మికులు చేపట్టిన నిరవధిక సమ్మె మంగళవారానికి ఐదో రోజుకు చేరింది. మంగళవారం వంటావార్పుతో కార్మికులు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆల్‌ యూనివర్సిటీస్‌ ఎంప్లాయీస్‌ అండ్‌ వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర కోశాధికారి గండికోట నాగ వెంకటేష్‌ మాట్లాడుతూ సమస్యల పరిష్కారానికి ఫిబ్రవరి 16వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా నిరవధిక సమ్మె చేపట్టామన్నారు. గత 22 సంవత్సరలుగా పనిచేస్తున్న కాంట్రక్టు కార్మికులకు కనీస వేతనలు అమలు చేయడం లేదని, సుప్రీం తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వడం లేదని, టైంస్కేలు ఇవ్వడం లేదని వాపోయారు. ప్రతినెలా జీతాలివ్వలని, టైంస్కేల్‌ అమలు చేయాలని, ఇఎస్‌ఐ, పిఎఫ్‌, ప్రమదబీమా ఐదు లక్షలు ఇవ్వాలని, ప్రభుత్వ సెలవులు అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు జయచంద్ర, ఆప్కాస్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షుడు చిన్నబాబు, యూనియన్‌ అధ్యక్షురాలు వరలక్ష్మి, కార్యదర్శి రాకేష్‌, నాయకులు సుబ్బు, రేవతి, చంద్రమ్మ, అనురాధ, మునిలక్ష్మి, రమా, మురళి పాల్గొన్నారు

➡️