విద్యార్థులకు క్రీడలతోనే మానసిక ఆరోగ్యం

విద్యార్థులకు క్రీడలతోనే మానసిక ఆరోగ్యం

విద్యార్థులకు క్రీడలతోనే మానసిక ఆరోగ్యం ప్రజాశక్తి – క్యాంపస్‌ : విద్యార్థిని విద్యార్థులు శారీరక, మానసిక ఆరోగ్యంతో పాటు ఒత్తిడిని జయించి సంపూర్ణ ఆరోగ్యంతో మంచి ఫలితాలు సాధించడానికి క్రీడలు, సాంస్కతిక కార్యక్రమాలు దోహదం చేస్తాయని శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్‌ దేపురు భారతి అన్నారు. స్థానిక శ్రీ వెంకటేశ్వర వ్యవసాయ కళాశాల వేదికగా ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం రెండో విడత అంతర్‌ కళాశాలల, క్రీడలు, ఆటలు, సాహిత్య సాంస్కతిక సమ్మేళనం 2023-24ను ప్రారంభిస్తూ విద్యార్థులు క్రీడలు సాహిత్య, సాంస్కతిక కార్యక్రమాల పట్ల మక్కువ పెంచుకోవడం ద్వారా మానసిక, శారీరక దారుఢ్యం తో పాటు, సజనాత్మకత పెంపొందుతాయని, మన సంస్కతి సంప్రదాయాలను పరిరక్షించుకోవడం, విద్యార్థుల ఆత్మవిశ్వాసం పెంపొందించుకోవడం తద్వారా సమాజం సమ్మిళిత అభివద్ధికి దారితీస్తుందన్నారు. వ్యవసాయ విశ్వవిద్యాలయ విద్యార్థి వ్యవహారాల డీన్‌ డాక్టరు పి సాంబశివరావు మాట్లాడుతూ ఈ క్రీడలు సజావుగా సాగడానికి కళాశాలలో తగిన ఏర్పాట్లు చేశామని ప్రతి ఒక్కరూ క్రీడా స్ఫూర్తితో పాల్గొనాలని విద్యార్థిని విద్యార్థులకు సూచించారు. వ్యవసాయ కళాశాల అసోసియేట్‌ డీన్‌ డాక్టర్‌ జి ప్రభాకరరెడ్డి మాట్లాడుతూ వ్యవసాయ కళాశాలలో జరిగే ఈ సమ్మేళనానికి ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలో రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయ, వ్యవసాయ ఇంజినీరింగ్‌, ఫుడ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ కళాశాలలకు చెందిన 678 మంది విద్యార్థిని విద్యార్థులు పాల్గొంటున్నారని విద్యార్థులు ప్రతి ఒక్కరూ క్రీడా స్ఫూర్తిని చాటాలని కోరారు. వ్యవసాయ విశ్వవిద్యాలయ పాలకమండలి సభ్యులు డాక్టర్‌ పివి. సత్యగోపాల్‌ మాట్లాడుతూ విశ్వవిద్యాలయ స్థాయిలో విద్యతోపాటు క్రీడలకు, సాంస్కతిక కార్యక్రమాలకు తగు ప్రాధాన్యమిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కళాశాల బోధన సిబ్బంది, వివిధ కళాశాలల ఫిజికల్‌ డైరెక్టర్లు, విద్యార్థి వ్యవహారాలు ఇన్‌ఛార్జులు, విద్యార్థిని విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు.

➡️