విద్యా పరిశోదన కేంద్రంగా…’అక్షర’ దీపం వెలిగిస్తున్న ‘ఎంఎంబిజి’

విద్యా పరిశోదన కేంద్రంగా...'అక్షర' దీపం వెలిగిస్తున్న 'ఎంఎంబిజి'

విద్యా పరిశోదన కేంద్రంగా…’అక్షర’ దీపం వెలిగిస్తున్న ‘ఎంఎంబిజి’వీళ్లకు చదువు రాదు, వీళ్లు చదువుకు పనికిరారు, వీళ్లకు చదువు చెప్పలేము అనే వాళ్లను అక్కున చేర్చుకుని వారిని ప్రతిభవంతులుగా తీర్చిదిద్దడంలో ఆయనకు ఆయనే సాటి. చదువులో వెనుకబడిన వారిలో మేథోశక్తిని పెంపొందించేదుకు స్లేట్‌ ప్యాటర్న్స్‌ను తన పరిశోధనల ద్వారా రూపొందించి, విద్యార్థుల చేతిరాతను అందంగా మార్చుతున్నారు. తాను కనిపెట్టిన ప్యాటర్న్స్‌కు 2023 ఏప్రిల్‌లో పేటెంట్‌ పొందారు. తిరుపతి అన్నారావు సర్కిల్‌ సమీపంలో 2014లో బాస్కర్‌రాజు ఎడ్యుకేషనల్‌ హాస్పిటల్‌ అండ్‌ రీసెర్చ్‌ సెంటర్‌ను స్థాపించి, తెలుగు, ఇంగ్లీషు, హిందీ బాషలపై విద్యార్థులు పట్టుసాధించేలా తన పరిశోధన అంశాల ద్వారా అందిస్తున్నారు.ప్రజాశక్తి-తిరుపతి సిటి ‘విద్య విజ్ఞానాన్ని పంచాలి… విలువలను పెంచాలి.. విద్య వ్యాపారం కాదు వికాసం’ అని నమ్మారు చదువుల డాక్టర్‌ సంగరాజు భాస్కర్‌రాజు. నమ్మడమే కాదు.. శాస్త్రీయంగా నిరూపించారు.. ఎంతోమంది చిన్నారులను పరిశీలించారు.. పరిశోధించారు.. ఫలితాలను రాబట్టారు..ప్రస్తుతం వేలాదిమందికి చదువుల జ్ఞానాన్ని పంచి పెడుతున్నారు.. మేక్‌ మై బేబీ జీనియస్‌ విద్యాసంస్థను పరిశోధనా కేంద్రంగా నిలిపారు డాక్టర్‌ సంగరాజు భాస్కర్‌రాజు. సాధారణ రైతు కుటుంబంలో పుట్టి, కుటుంబంలో విషాద ఘటనలు చవి చూసి, అనేక ఒడిదుడుకులు, ఆర్థిక ఇబ్బందులు, మానసిక ఒత్తిడి ఉన్నా సంకల్ప బలంతో వెనకడుగు వేయలేదు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా లక్ష్యాన్ని వీడలేదు. చదువుపైనే రీసెర్చి చేశారు. సులభంగా, అర్ధవంతంగా చదువును ప్రతి ఒక్కరికీ దగ్గర చేయాలనే దృఢ సంకల్పంతో ‘అక్షర’ దీపం వెలిగిస్తున్నారు. బట్టీ చదువులు వద్దని, పిల్లల్ని ర్యాంకుల యంత్రాలుగా మార్చొద్దని శాస్త్రీయ పద్ధతిలో చైతన్యవంతులను చేస్తున్నారు. ‘అక్షర’ దీపం వెలుగులో తమ పిల్లల్ని విజ్ఞానవంతులుగా తీర్చిదిద్దిన భాస్కర్‌రాజుకు తల్లిదండ్రుల దీవెనలు విజ్ఞాన శిఖరాలను అధిరోహించేలా చేస్తున్నాయి. భాస్కర్‌రాజు పరిశోధన కేంద్రం (ఎంఎంబిజి) గురించి, విద్యార్దుల్లో విద్యాభివృద్ధిపై తల్లిదండ్రులే తమ అభిప్రాయాలను వెల్లడించారు. అవి వారి మాటల్లోనే…. విద్యార్థులపై ఒత్తిడిలేని విద్యను అందిస్తున్నారు భాస్కర్‌రాజు. నేను 850 రూపాయల వేతనంతో ఉద్యోగంలో చేరి, 2 లక్షల 70వేల రూపాయలు వేతనంతో రిటైరు అయ్యాను. ఉద్యోగ రిత్యా ఈజిప్టు, యుఎస్‌ఏ, ఇరాక్‌, యురేనేషియా, తదితర దేశాలు తిరిగాను. తర్వాత తిరుపతిలో స్థిరపడ్డాను. దేశ విదేశాలు తిరగడంతో నా బిడ్డలకు తెలుగు బాష సరిగా రాలేదు. ఎంఎంబిజి గురించి తెలుసుకుని మా బిడ్డలను ఇక్కడ చేర్చాను. తెలుగు, ఇంగ్లీషు, హిందీ బాషల్లో అనతికాలంలోనే మంచి ప్రావీణ్యం సంపాదించారు. నేను తిరిగిన దేశాల్లో ఎక్కడా ఇలాంటి క్రమబద్దమైన, ప్రణాళిక బద్దంగా విద్యార్థులను మెప్పించే రీతిలో విద్యను అందించే సంస్థలు లేవు. గత ఏడాది ఓ అసోసియేషన్‌ మీటింగ్‌పై ఎంఎంబిజి వేదికగా జరిగిన సమావేశానికి హజరయ్యాను. ఆ సమావేశంలో బాస్కర్‌రాజు కుమార్తె అశ్వని హ్యాండ్‌రైటింగ్‌ కోర్సుపై అవగాహన కల్పించారు. దీంతో స్పూర్తిపొందిన నేను సమ్మర్‌ క్యాంప్‌లో ఎంఎంబిజి ప్రత్యేక తరగతులకు మా కుమార్తెను పంపాను, పాపకు చదువుపై శ్రద్దపెరిగింది. చిన్నతనం నుంచే మా పాపకు కంటిచూపు సమస్య ఉంది. పెద్ద పెద్ద డాక్టర్లు పరిశీలించి 25 ఏళ్ల వరకే సైట్‌ ఉంటుందని, ఆ తరువాత ఆపరేషన్‌ చేయాలని తేల్చి చెప్పారు. ఎంఎంబిజిలో మా పాప చేరిన తర్వాత కొన్ని రోజులకు కంటి అద్దాల అవసరం లేకుండా పోయింది. డాక్టర్లకు చూపిస్తే పాపకు సైట్‌ లేదని తేల్చారు. అక్షర దీపమే కాదు, కంటి వెలుగును ప్రసాదించారు. నేను ఎస్‌బిఐ ఉద్యోగి. సాధారణ బదిలీల్లో భాగంగా రకరకాల ప్రాంతాల్లో పనిచేయాల్సి వచ్చింది. ఏడాదిన్నర క్రితం తిరుపతికి మకాం మార్చాం. పిల్లల చదువు కోసం అన్వేషణ చేశాను. ఎంఎంబిజి గురించి తెలుసుకుని బాస్కర్‌రాజును సంప్రదిస్తే మొదట్లో కుదరదన్నారు. రెండో సారి కలిస్తే సరేనన్నాడు. తెలుగు చదవడం సక్రమంగా రాని మా బాబు ఇప్పడు సంస్కృత శ్లోకాలు చెబుతున్నాడు. భగవద్గీతను అవలీలగా చదివేస్తున్నాడు. గతంలో ఏలూరు సిఆర్‌ రెడ్డి స్కూల్‌లో చదివిన మా బాబు, ఇప్పడు దానికి మిన్నగా తయారయ్యాడు. ఇంతటి శాస్త్రీయ పద్ధతిలో విద్యను బోధించే విద్యాసంస్థ తిరుపతిలో ఉండటం నగర వాసుల అదృష్టమనే చెప్పాలి. మేము చెన్నరులో నివశిస్తున్నాం. ఇటీవల తిరుపతికి రావాల్సి వచ్చింది. తెలుగు మా ఇంటిలో పెద్దవాళ్లు కాస్త మాట్లాడగలరు. చదవడం, రాయడం అసలు రాదు. మా పిల్లలకు తెలుగు, ఇంగ్లీషు, హిందీ బాషలను నేర్పించాలని బావించి ఎంఎంబిజిలో చేర్చించాం. ఇప్పడు వారు మాకు తెలుగు రాయడం, చదవడం నేర్పిస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. పిల్లల భవిష్యత్తుకు బంగారు బాటలు వేయడంలో సంగరాజు బాస్కర్‌ రాజు ఆయనకు ఆయనే సాటి. డిగ్రీ డిస్కంటిన్యూ అయిన నేను మా పిల్లలకు మంచి విద్యను అందించాలని, తిరుపతి మొత్తం జల్లెడ పట్టాను. బాస్కర్‌రాజు గురించి, తెలుసుకుని, ఆయన స్కూల్‌లో మా పిల్లలను చేర్పించాను. మా పిల్లల భవిష్యత్తుపై ఇప్పడు నాకు చింత లేదు. ఎంతో మంది తల్లిదండ్రులు ఆయనకు రుణపడి ఉంటారు. భావిబారత పౌరులైన విద్యార్థులకు విజ్ఞానాన్ని అందించే, విలువలతో కూడిన విద్య అవసరం. ఆ దిశగా భాస్కర్‌రాజు అహర్నిశలు కృషి చేస్తున్నారు. 20 సంవత్సరాలుగా ఆయన నాకు తెలుసు. ఆయనపై నమ్మకంతోనే మా బాబును ఎంఎంబిజిలో చేర్చాను. 3 నెలల్లోనే భగవద్గీత శ్లోకాలను అనర్గళంగా అప్పజెప్పతున్నాడు. కరోనా వంటి సమయంలో చదువుకాలాన్ని నష్టపోయిన విద్యార్థుల్లో సైతం మానసిక స్థైర్యాన్ని నింపి, వారిలో కాన్పిడెన్స్‌ పెంచి, విజ్ఞాన వంతులుగా తీర్చిదిద్దుతున్నారు.

➡️