శీసిటీని సందర్శించిన బెల్జియం రాయబారి

శీసిటీని సందర్శించిన బెల్జియం రాయబారి

శీసిటీని సందర్శించిన బెల్జియం రాయబారి ప్రజాశక్తి- వరదయ్యపాలెంభారత్‌లోని బెల్జియం రాయబారి డిడియర్‌ వాండర్‌హాసెల్ట్‌ బుధవారం శ్రీసిటీని సందర్శించారు. శ్రీసిటీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ రవీంద్ర సన్నారెడ్డి ఆయనకు సాదర స్వాగతం పలికి, ఇక్కడ ప్రపంచశ్రేణి మౌళిక వసతులు, ప్రత్యేకతలు, వేగవంతమైన పారిశ్రామిక ప్రగతి గురించి వివరించారు. బెల్జియంకు చెందిన వెర్మీరెన్‌తో సహా 29 దేశాల నుండి 220కి పైగా ప్రముఖ కంపెనీలకు నిలయంగా, భారతదేశంలో ప్రముఖ తయారీ కేంద్రంగా శ్రీసిటీ స్థానం దక్కించుకుందని పేర్కొన్నారు. భారత్‌ లో పెట్టుబడులు పెట్టాలనుకునే మరిన్ని బెల్జియన్‌ కంపెనీలకు తాను శ్రీసిటీని పరిచయం చేస్తానని చెప్పారు. రాయబారితో పాటు బెల్జియంలోని ఫ్లాండర్స్‌ రీజియన్‌ ట్రేడ్‌ అండ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ కమీషనర్‌ జయంత్‌ నడిగర్‌ పాల్గొన్నారు.

➡️