శ్రీగంధం స్మగ్లర్లు అరెస్ట్‌

శ్రీగంధం స్మగ్లర్లు అరెస్ట్‌

శ్రీగంధం స్మగ్లర్లు అరెస్ట్‌ప్రజాశక్తి -చిన్నగొట్టిగల్లు: భాకరాపేట చామల ఫారెస్ట్‌ రేజ్‌ అధికారి ఎమ్‌ దత్తాత్రేయకు చిన్నగొట్టిగల్లు సమీపంలో ఆటోలో స్మగ్లర్లు శ్రీగంధం చెక్క లను తరలిస్తున్నట్టు సమా చారం అందిందని, తమ సిబ్బందిని ఆప్రమత్తం చేసి నిఘా వేశామని అటవీ పోలీసు లు తెలిపారు. చాకచక్యంగా దేవర కొండకు చెందిన వక్కల సురేంద్ర , చింత గుంట గ్రామానికి చెందిన పిల్లుల నరేంద్రలను పట్టుకున్నామని వారి నుండి 45 కేజీల బరువుగల రూ.1,35,000 విలువ చేసే శ్రీ గంధాన్ని స్వాధీనం చేసుకుని నిందితులను అరెస్టు చేసి కేసు దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఈ దాడిలో ఆయనతో పాటు ఎఫ్‌ఎస్‌వో ఎస్‌ఆర్‌ తౌఫిక్‌ ఇస్లామ్‌, ఎఫ్‌బివోలు ఎమ్‌ సదాశివం, వై రాజేష్‌, డ్రైవర్‌ శంకర్‌, బేస్‌క్యాంపు ప్రొడక్షన్‌ వాచర్లు పాల్గొన్నారన్నారు.

➡️