‘శ్రీచైత్ర’లో నాణ్యమైన, అత్యాధునిక వైద్యం

Dec 5,2023 21:36
'శ్రీచైత్ర'లో నాణ్యమైన, అత్యాధునిక వైద్యం

ప్రజాశక్తి-తిరుపతి సిటి: యురాలజీ, గైనకాలజీ విభాగాలతో పాటు అనేక విభాగాలకు చెందిన సమస్యలకు ‘శ్రీచైత్ర’ ఆసుపత్రిలో అత్యాధునిక పద్దతుల్లో నాణ్యమైన వైద్యాన్ని అందిస్తున్నట్లు ఆ ఆసుపత్రి ఆధినేతలు, ప్రముఖ కిడ్నీ, మూత్రకోశ వ్యాధి వైద్య నిపుణులు డాక్టరు టి.శ్యామ్‌ సుందర్‌, ప్రసూతి, గర్భకోశ వ్యాధి వైద్య నిపుణులు డాక్టరు ఎం.లక్ష్మీప్రసన్న తెలిపారు. స్థానిక దేవేంద్ర థియేటర్‌ సమీపంలోని అశోక్‌నగర్‌, రాయలసీమ పబ్లిక్‌ స్కూల్‌ లైన్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీచైత్ర ఆసుపత్రి ప్రాంగాణంలో వారు ‘ప్రజాశక్తి’తో మాట్లాడుతూ తిరుపతి నగర వాసులకు కార్పొరేట్‌ వైద్యానికి ధీటుగా సామాన్య ప్రజలకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం కల్గిన నాణ్యమైన వైద్యాన్ని అందించాలనే ఉద్దేశంతో ఈ ఆసుపత్రిని ఏర్పాటు చేశామన్నారు. ఇప్పటికే తిరుపతితో పాటు మదనపల్లి, చిత్తూరు, పలమనేరు, రాయచోటి, రాజంపేట వంటి ప్రాంతాల్లోని ప్రజలకు మూత్రకోశవ్యాధుల, కిడ్నీ సంబంధిత వ్యాధులకు నాణ్యమైన వైద్యాన్ని అందిస్తూ, వారి మన్నలను పొందామన్నారు. వైద్యరంగంలోని విశేష అనుభవంతో అత్యాధునిక వైద్యాన్ని తిరుపతి వాసులకు మరింత చేరువ చేయాలనే సంకల్పంతో శ్రీచైత్ర ఆసుపత్రిని ఏర్పాటు చేశామన్నారు. కిడ్ని బ్లాడర్‌లో రాళ్లు, మూత్రనాళములో రాళ్లు, మూత్రదార సన్నగా రావడం, ప్రొస్టేట్‌ గ్రంధి వాపు, సెక్స్‌ సంబంధిత సమస్యలు, మగవారిలో సంతానలేమి సమస్యలు, మూత్రములో రక్తము, చీము కారడం, సుద్దపోవటం, చిన్నపిల్లల్లో కిడ్నీవాపు, మూత్ర సమస్యలు, స్త్రీలలో మూత్రము జారిపోవడం వంటి వ్యాధులు, స్త్రీలకు ప్రత్యేకంగా సాదారణ కాన్పులు, క్లిష్టమైన కాన్పులు, సిజజేరియన్‌ ఆపరేషన్లు, గర్భకోశ వ్యాదులు, మెనోపాస్‌ సమస్యలు, సంతానము లేని వారికి చికిత్స, గర్భకోశ క్యాన్సర్‌ స్క్రీనింగ్‌, రుతుస్రవ సమస్యలు, అండాశయంలో నీటి బుడగలు వంటి సమస్యలతో పాటు అనేక వైద్య విభాగాలకు చెందిన సమస్యలకు వైద్యం అందిస్తున్నామన్నారు. మా ఆసుపత్రిలో తిరుపతినగరంలోనే మొట్టమొదటి సారిగా అత్యాధునిక ‘థూలియం లేజర్‌’ యంత్రాన్ని అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. శ్రీచైత్ర ఆసుపత్రుల్లో ఆర్‌ఐఆర్‌ఎస్‌ పద్దతి ద్వారా కోత, కుట్లు లేకుండా కిడ్నీలో రాళ్లు సమస్యలకు చికిత్స అందిస్తున్నామన్నారు. ఇటీవల 180 కేజీల బరువు ఉన్న ఓ వ్యక్తి ఆర్‌ఐఆర్‌ఎస్‌ పద్దతి ద్వారా చికిత్స అందించామన్నారు. సాధారణంగా అథిక బరువు ఉన్న వారికి ఇలాంటి చికిత్స అందిచేందుకు ఇబ్బంది ఉంటుందని కనుక చికిత్స అందించేందుకు ఆలోచిస్తారన్నారు. కానీ తాము ఎలాంటి ఇబ్బంది లేకుండా, రోగిలో దైర్యాన్ని నింపి విజయవంతంగా శస్త్రచికిత్స నిర్వహించామని తెలిపారు. అలాగే 5 సంవత్సరాల వయస్సున్న చిన్నారికి మూత్రనాళం కింద బాగం బాగా ఉబ్బి ఉండడంతో యారుట్రోనిల్‌ అనే వ్యాధికి విజయవంతంగా చికిత్స అందించామని, ప్రస్తుతం ఆ చిన్నారి ఆరోగ్యవంతంగా ఉందన్నారు. ఇలా అనేక క్లిష్టమైన సమస్యలకు మా ఆసుపత్రిలో నాణ్యమైన వైద్యాన్ని, అన్ని రంగాల ప్రజలకు అందుబాటులో ఉంచామని వెల్లడించారు. శ్రీచైత్ర ఆసుపత్రిలో డాక్టరు వైఎస్‌ఆర్‌ ఆరోగ్యశ్రీ హెల్త్‌కేర్‌ ట్రస్టు ద్వారా, ఎంప్లాయిస్‌ హెల్త్‌స్కీమ్‌ ద్వారా, ప్రయివేట్‌ ఇన్సూరెన్స్‌ సౌకర్యం కూడా కలదని, అన్ని రకాల కోత కుట్లు లేని, ల్యాపరోస్కోపి ఆపరేషన్లు అందించడం మా ప్రత్యేకత అని తెలిపారు. ఈ అవకాశాన్ని రోగులు వారి సహయకులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వివరాలకు 7995167476, 7382174047 ఫోన్‌ నెంబర్లను సంప్రదించాలని కోరారు.

➡️