శ్రీసిటీని సందర్శించిన ట్రైనీ ఐఏఎస్‌ అధికారులు

శ్రీసిటీని సందర్శించిన ట్రైనీ ఐఏఎస్‌ అధికారులు

శ్రీసిటీని సందర్శించిన ట్రైనీ ఐఏఎస్‌ అధికారులుప్రజాశక్తి- వరదయ్యపాళ్యం: భారత్‌ దర్శన్‌ స్టడీ టూర్‌లో భాగంగా 2023 బ్యాచ్‌కు చెందిన 19మంది ట్రైనీ ఐఏఎస్‌ అధికారులు సోమవారం శ్రీసిటీని సందర్శించారు. శ్రీసిటీ ప్రెసిడెంట్‌ (ఆపరేషన్స్‌) సతీష్‌ కామత్‌ వీరికి సాదరస్వాగతం పలికారు. ప్రపంచశ్రేణి మౌళిక వసతులు, ప్రత్యేకతలతో పాటు దేశంలోని భారీ పారిశ్రామిక పార్కులలో ఒకటిగా శ్రీసిటీ ఎలా ఉద్బవించింది, మేక్‌-ఇన్‌-ఇండియా నినాదం మేరకు అత్యంత వేగంగా ఉద్యోగాల కల్పన, ఈ ప్రాంత ఆర్థిక వ్యవస్థకు ఎలా ఊతమందించి అన్న అంశాలను వారికి వివరించారు. శ్రీసిటీ మౌళిక సదుపాయాలు, వ్యాపార అనుకూల వాతావరణం అద్భుతం అంటూ ట్రైనీ ఐఏఎస్‌ల బందం లీడర్‌ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇతరులు అనుసరించాల్సిన ఒక మోడల్‌గా దీనిని అభివర్ణించారు. శ్రీసిటీ వాతావరణం, పారిశ్రామిక మౌళిక సదుపాయాలు ఇక్కడ ‘సులభతర వ్యాపారం’, ‘సులభతర జీవన సౌలభ్యాన్ని’ నిర్ధారిస్తున్నాయన్నారు. ట్రైనీ ఐఏఎస్‌ అధికారుల పర్యటన పట్ల తన సందేశంలో సంతోషం వ్యక్తం చేసిన శ్రీసిటీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ రవీంద్ర సన్నారెడ్డి, ట్రైనీ ఐఏఎస్‌లే కాకుండా దేశ విదేశాలకు చెందిన అధికారులు, వ్యూహకర్తలు, నిర్వాహకులు, సాంకేతిక నిపుణులు తమ అధ్యయనానికి శ్రీసిటీని ఎంచుకోవడం తమకు గర్వకారణమన్నారు. తమ అనుభవాలను వారితో పంచుకోవడం ఆనందంగా ఉందన్నారు. పర్యటనలో భాగంగా ట్రైనీ ఐఏఎస్‌లు శ్రీసిటీ పరిసరాలు సందర్శించారు. శ్రీసిటీ అధికారులతో చర్చల సందర్భంగా పారిశ్రామికవాడకు సంబంధించిన వివిధ అంశాలపై ఆరా తీశారు.

➡️