సర్వేల్లోనూ నేనే ఎమ్మెల్యేగా : సుగుణమ్మ

సర్వేల్లోనూ నేనే ఎమ్మెల్యేగా : సుగుణమ్మ

సర్వేల్లోనూ నేనే ఎమ్మెల్యేగా : సుగుణమ్మ ప్రజాశక్తి-తిరుపతి(మంగళం)రానున్న సార్వత్రిక ఎన్నికల్లో నగదు, మద్యాన్ని పంచకుండా ఎన్నికల్లో పాల్గొనడానికి మేము సిద్ధంగా ఉన్నామని, అధికార వైసిపి పార్టీ సిద్దమా అని తిరుపతి మాజీ ఎంఎల్‌ఎ సుగుణమ్మ సవాల్‌ విసిరారు. సోమవారం తిరుపతి ప్రెస్‌ క్లబ్‌ లో విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ గడిచిన సంవత్సరాలుగా రాష్ట్రంలో వైసిపి పాలనతో ధర్మం గాడి తప్పిందని, ధర్మాన్ని పరిరక్షించడానికి జనసేన, టీడీపీ పార్టీలు సంయుక్తంగా కలిసి ఎన్నికల్లో పోటీకి దిగనున్నాయన్నారు. తిరుపతిలో తండ్రి కొడుకుల ఇష్టారాజ్యం కొనసాగుతోందన్నారు. టిటిడి చైర్మన్‌ గా దోచుకుంటున్నారని ఆరోపించారు. తమ కుటుంబం 1982 నుండి ప్రజా సేవ కోసం పనిచేస్తుందని, వివిధ హౌదాల్లో ప్రజలకు సేవ చేసామన్నారు. ప్రజా సర్వేలో తాను ఎమ్మెల్యేగా 2024లో గెలుపు సాధిస్తానని ఫలితాలు వచ్చాయని, ప్రజలకు తమ కుటుంబంపై ఉన్న నమ్మకానికి కతజ్ఞతలు తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో టిడిపి నాయకులు ఆర్సి మునికష్ణ, పుష్పవతి, బుల్లెట్‌ రమణ, మునిశేఖర్‌ రాయల్‌, వూట్ల సురేందర్‌ నాయుడు, దంపురి భాస్కర్‌, మహేష్‌ పాల్గొన్నారు.

➡️