సిఎంను కలిసిన వైసిపి నాయకులు

సిఎంను కలిసిన వైసిపి నాయకులు

సిఎంను కలిసిన వైసిపి నాయకులుప్రజాశక్తి-నాయుడుపేట: క్రిస్మస్‌ సందర్భంగా నాయుడుపేట వైసిపి నాయకులు సిఎం జగన్‌మోహ న్‌రెడ్డి ఆదివారం కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఆదివారం ఉద యం ఇడుపులపాయలోని వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద అతని తండ్రి, మాజీ ముఖ్య మంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయుడుపేట వైసిపి పట్టణ అధ్యక్షులు, నాయుడుపేట మున్సిపల్‌ వైస్‌ ఛైర్మన్‌ షేక్‌ రఫీ ముఖ్య మంత్రి జగన్మోహన్‌ రెడ్డిని కలిసి వారికి, వారి కుటుంబానికి క్రిస్మస్‌ శుభాకాంక్షలు తెలిపారు. ఆయనతో పాటు కాళహస్తి నియోజకవర్గ వైసిపి పరిశీలకులు ఓడూరు గిరిధర్‌ రెడ్డి, రాష్ట్ర రైతు విభాగ అధ్యక్షులు కళత్తూరు రామ్మోహన్‌ రెడ్డి, రాకేష్‌ రెడ్డి, మరి కొందరు వైసిపి నాయకులు పాల్గొన్నారు.

➡️