1వ తేదీ నుంచి టీటీడీ ఉద్యోగుల వార్షిక క్రీడాపోటీలు

1వ తేదీ నుంచి టీటీడీ ఉద్యోగుల వార్షిక క్రీడాపోటీలుప్రజాశక్తి- తిరుపతి సిటీ : టీటీడీ ఉద్యోగుల వార్షిక క్రీడాపోటీలు మార్చి 1వ తేదీ శుక్రవారం ఉదయం 10 గంటలకు తిరుపతిలోని పరిపాలనా భవనంలో గల పరేడ్‌ మైదానంలో ప్రారంభమవుతాయని టీటీడీ చీఫ్‌ పిఆర్‌ఓ డాక్టర్‌ రవి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పోటీలు మార్చి 18వ తేదీ వరకు జరుగనున్నాయి. ప్రారంభ కార్యక్రమంలో క్రీడల్లో పాల్గొనేందుకు నమోదు చేసుకున్న ఉద్యోగుల పేర్లు, టీమ్‌లు, పోటీ షెడ్యూల్‌ తదితర వివరాలు తెలియజేయడం జరుగుతుంది. పురుషులకు, మహిళలకు వేరువేరుగా పోటీలు నిర్వహిస్తారు. ఇందులో టగ్‌ ఆఫ్‌ వార్‌, చెస్‌, వాలీబాల్‌, క్యారమ్స్‌, బాల్‌ బ్యాడ్మింటన్‌, ఫుట్‌బాల్‌, టేబుల్‌ టెన్నిస్‌, క్రికెట్‌, షటిల్‌, టెన్నిస్‌ తదితర క్రీడలు నిర్వహిస్తారు. టీటీడీ సంక్షేమ విభాగం డెప్యూటీ ఈవో స్నేహలత క్రీడల ఏర్పాట్లను పర్యవేక్షిస్తారని పేర్కొన్నారు.

➡️