రాజ్యాంగానికి తూట్లుపడినా అడగొద్దుదళిత బడుగు బలహీన అభ్యర్థుల తీరుఅంబేద్కరా.. మన్నించుమా..!

రాజ్యాంగానికి తూట్లుపడినా అడగొద్దుదళిత బడుగు బలహీన అభ్యర్థుల తీరుఅంబేద్కరా.. మన్నించుమా..!

రాజ్యాంగానికి తూట్లుపడినా అడగొద్దుదళిత బడుగు బలహీన అభ్యర్థుల తీరుఅంబేద్కరా.. మన్నించుమా..!ప్రజాశక్తి – తిరుపతి బ్యూరో ‘హమ్మయ్య మొన్న ఆదివారం ఓ పెద్ద పనైపోయింది.. ఏప్రిల్‌ 14న అంబేద్కర్‌ జయంతి.. ప్రపంచ మేధావి, బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ పుట్టినరోజు. మొన్నంతా ఆయనను అందరూ పూజించేశాం. ఆయన పుణ్యాన మాకు ఎన్నికల్లో పోటీచేసే రిజర్వేషన్‌ అవకాశం లభించింది. ఇక రేపటినుంచి అంబేద్కర్‌ ఆశయాలకు తూట్లు పొడిచే పనిలో ఉంటాం. ఎందుకంటే మేం ఏమి చేసినా మమ్మల్ని ప్రశ్నించేవారు ఎవరూ లేరు. ఆయన వారసులైన దళిత బడుగు బలహీన పేదలే కాదు, బూర్జువా రాజకీయ నాయకులు ఎన్నికల సందర్భంగా అత్యుత్సాహం ప్రదర్శించి అంబేద్కర్‌ విగ్రహాలన్నీ పూలమాలలతో ముంచెత్తారు.. టెంకాయలు కొట్టి, కర్పూరం వెలిగించి అన్నదానం చేసి గొప్ప గొప్ప మీటింగ్‌లు పెట్టి, పెద్దపెద్ద మాటలు మాట్లాడేశాం. రాజ్యాంగానికి తూట్లు పొడిచినా, మనువాదాన్ని తీసుకొచ్చినా మాకేం సంబంధం లేదు. మీపై వివక్ష చూపించినా, మీపై పెత్తందారులు దాడి చేసినా, కులదురహంకార హత్యలు జరిగినా, దేవుని గుడిలోకి మిమ్మల్ని రానివ్వకపోయినా, మీ భూముల్లో పెత్తందారులు పాగా వేసినా మమ్మల్ని మాత్రం అడగొద్దు.. ఈ నెలరోజులూ మా జెండా మోయండి.. సాయంత్రం ఇంటికెళ్లే ముందు ఓ 500 నోటు, ఓ క్వార్టర్‌ బాటిల్‌, ఓ బిరియాని ప్యాకెట్‌ ఇస్తాం. ఈ నెలరోజులూ మీకు ‘ఉపాధి హామీ’ ఇదే. వచ్చే ఐదేళ్లలో ఉపాధి హామీ ద్వారా మీకు పని కల్పించకపోయినా, బిల్లులు పడకపోయినా, వసతులు లేకపోయినా మాకేం సంబంధం లేదు. ఈ ఎన్నికల్లో సత్యవేడు, గూడూరు, సూళ్లూరుపేట, తిరుపతి ఎంపి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నాం. ఎన్నికలకు ముందు రోజు మీ అమూల్యమైన ఓటుకు ‘నోటు’ ఇస్తాం. ఆ తరువాత అపుడపుడు సంక్షేమం పేరుతో ఎంతోకొంత మీ అకౌంట్లలో విదిలిస్తాం. గెలిచిన తరువాత మాత్రం మా వెనకుండి మమ్మల్ని గెలిపించిన కార్పొరేట్‌ శక్తులకు సహజ వనరుల కాంట్రాక్టులన్నీ కట్టబెడతాం. ఎన్నికల పెట్టుబడి పెట్టినందుకు ఆ మాత్రం ‘రుణం’ తీర్చుకోక తప్పదు. వాళ్లకు ఎదురు తిరిగామంటే వచ్చే ఏడాది సీటివ్వరు. ఈ ఏడాదీ సిట్టింగ్‌లకు రెండు ప్రాంతాల్లోనూ సీట్లు లేకుండా పోయాయి. రిజర్వేషన్‌ నియోజకవర్గాలన్నింటినీ కార్పొరేట్‌ శక్తులు వెనకుండి శాసిస్తాయి. తప్పదు.. మహామహులకే తప్పలేదు. ‘పెద్దాయన’ తలచుకున్నందుకు చిత్తూరు జిల్లా జీడీనెల్లూరు నియోజకవర్గం ‘స్వామి’కే సీటు లేకుండా పోయింది. ఆఫ్ట్రాల్‌ మేం ఎంత? ఏ పార్టీ నుంచి పోటీచేసినా అధినేతల కనుసన్నల్లో పని చేయాల్సిందే. టిడిపి, జనసేన, వైసిపి మూడు పార్టీలూ బిజెపికే కొమ్ముగాస్తున్నాయి. మనువాదాన్ని తీసుకొచ్చినా, భవిష్యత్‌లో రిజర్వేషన్లకే తూట్లు పడినా మేం ఏమి చేయలేని నిస్సహాయులం. రిజర్వేషన్‌ పుణ్యమా అని విద్యావేత్తలమైనా, పదవులు దక్కించుకుంటున్నా… వివక్షకు అతీతులం కాదు.. అందుకే అంబేద్కరా.. మమ్మల్ని క్షమించు. (మనస్సున్న అభ్యర్థుల మనోగతం)

➡️