ఎస్వీయూలో నూతన కోర్సులకు ఆమోదం

ఎస్వీయూలో నూతన కోర్సులకు ఆమోదం

ఎస్వీయూలో నూతన కోర్సులకు ఆమోదంప్రజాశక్తి – క్యాంపస్‌ శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయ అకడమిక్‌ సెనేట్‌ సమావేశం సోమవారం ఉదయం 10.30 గంటల నుండి 1 గంట వరకు ఎస్వీయూ ఉపకులపతి ఆచార్య వి. శ్రీకాంత్‌ రెడ్డి అధ్యక్షతన సెనేట్‌ హాల్లో నిర్వహించారు. విద్యాపరమైన పలు నిర్ణయాలకు సెనేట్‌ ఆమోదం తెలిపినట్లు విసి వెల్లడించారు. 2022- 23 విశ్వవిద్యాలయ సంవత్సర నివేదికకు సెనేట్‌ ఆమోదం తెలిపింది. 2024-25 ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ కు ఆమోదం తెలిపినట్లు తెలిపారు. నూతన విద్యావిధానంలో భాగంగా ఎస్వీయూ పరిధిలో నిర్వహించబోవు పలు నూతన కోర్సులకు ఆమోదం తెలిపింది. పిజి కోర్సులకు సంబంధించిన సిలబస్‌ నూతన విద్యావిధానం ప్రకారం పలు మార్పులు చేయడానికి సెనేట్‌ ఆమోదించింది. ఈ సమావేశంలో పాలకమండలి సభ్యులు ఆచార్య సుగుణమ్మ, ఆచార్య పద్మనాభం, ఆచార్య సుమకిరణ్‌ , డా.సురేంద్రనాథ్‌ రెడ్డి, నారాయణ బాబు, రిజిస్ట్రార్‌ ఆచార్య మహమ్మద్‌ హుస్సేన్‌ , ఆచార్య ఎమ్‌ ఎమ్‌ నాయుడు పాల్గొన్నారు.

➡️