పోల్డ్‌ ఈవీఎంలను పరిశీలించిన కలెక్టర్‌

పోల్డ్‌ ఈవీఎంలను పరిశీలించిన కలెక్టర్‌ ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌ సార్వత్రిక ఎన్నికలు 2024 అనంతరం 25 చిత్తూరు (ఎస్‌సి) పార్లమెంటు నియోజకవర్గం, ఏడు అసెంబ్లీ నియోజక వర్గాలకు సంబంధించిన ఈవీఎంలను జిల్లాస్థాయి కౌంటింగ్‌ కేంద్రంగా ఉన్న పూతలపట్టు మండలం ఎస్‌వి సెట్‌ ఇంజనీరింగ్‌ కాలేజీ స్ట్రాంగ్‌ రూములలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల నడుమ సీలింగ్‌ చేసే ప్రక్రియను మంగళవారం రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో చిత్తూరు, పూతలపట్టు, పలమనేరు, కుప్పం సాధారణ పరిశీలకులు సాదిక్‌ ఆలం, నగరి, జీడి నెల్లూరు అసెంబ్లీ సెగ్మెంట్ల సాధారణ పరిశీలకులు కైలాష్‌ వాంఖడే, జిల్లా కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి ఎస్‌.షణ్మోహన్‌ నిర్వహించారు. 25 చిత్తూరు (ఎస్‌సి) పార్లమెంట్‌, 165- పుంగనూరు, 170- నగరి, 171 -జీడి నెల్లూరు, 172- చిత్తూరు, 173- పూతలపట్టు 174-పలమనేరు, 175- కుప్పం నియోజకవర్గాలకు సంబంధించి పోల్డ్‌ అయిన ఈవిఎంలు స్ట్రాంగ్‌ రూములకు చేరుకొనే ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్‌ కలెక్టర్‌, 172-చిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గం రిటర్నింగ్‌ అధికారి పి. శ్రీనివాసులు, అసిస్టెంట్‌ కలెక్టర్‌ హిమవంశీ, డిఆర్‌ఓ బి.పుల్లయ్య, పుంగనూరు, నగరి, జీడి నెల్లూరు, పూతలపట్టు, పలమనేరు, కుప్పం ఆర్‌ఓలు, మధుసూదన్‌ రెడ్డి, వెంకట్‌ రెడ్డి, వెంకట శివ, చిన్నయ్య, మనోజ్‌ రెడ్డి, శ్రీనివాసులు, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్‌ లక్ష్మీ ప్రసన్న, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

➡️