బాధ్యతగా విధులు నిర్వహించాలి జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్‌ కుమార్‌

బాధ్యతగా విధులు నిర్వహించాలి జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్‌ కుమార్‌ప్రజాశక్తి – తిరుపతి టౌన్‌ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న సిబ్బంది భాధ్యతగా విధులు నిర్వహించి, ఎన్నికలు సజావుగా సాగేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని తిరుపతి జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్‌ కుమార్‌ పేర్కొన్నారు. తిరుపతి కచ్చపి ఆడిటోరియంలో గురువారం సార్వత్రిక ఎన్నికల 2024 పై తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న ప్రిసైడింగ్‌ అధికారులకు, అసిస్టెంట్‌ ప్రిసైడింగ్‌ అధికారులకు రెండో విడత శిక్షణ ఇచ్చారు. తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గం రిటర్నింగ్‌ అధికారి అదితి సింగ్‌ ఐఏఎస్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న తిరుపతి జిల్లా కలెక్టర్‌ ప్రవీణ్‌ కుమార్‌ మాట్లాడుతూ ఎన్నికల కమిషన్‌ రూపొందించిన సూచనలు, నిర్ణయాలను అందరూ పాటించాలని, ఎన్నికల రోజు ప్రతి ఒక్క పోలింగ్‌ కేంద్రాల్లో మీకు కేటాయించిన ఎన్నికల విధులను బాధ్యతతో నిర్వహించాలని, ఎన్నికలు సజావుగా సాగేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. అదేవిధంగా ప్రిసైడింగ్‌ అధికారులు పి.ఓ డైరి, పి.ఓ రిపోర్ట్‌ ఎప్పటికప్పుడు ఎన్నికల రోజు నమోదు చేయాలన్నారు. తిరుపతి ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి అదితి సింగ్‌ ఐఏఎస్‌ మాట్లాడుతూ ఎన్నికల విధుల్లో భాధ్యతలు నిర్వహించే అధికారులు 12వ తేది తిరుపతి ఎస్వీ ఆర్ట్స్‌ కళాశాల వద్దకు వచ్చి మీ పోలింగ్‌ కేంద్రాలకు కేటాయించిన ఈవియంలను, వివి ఫ్యాట్లను, మిగతా సామాగ్రి అన్నింటిని స్వాదీనం చేసుకోవాలని, 13వ తేది పోలింగ్‌ రోజు ఉదయం 5 గంటలకు పోలింగ్‌ కేంద్రాల్లో సిద్దంగా వుండాలన్నారు. పోలింగ్‌ రోజు ఉదయం 7 గంటల నుండి పోలింగ్‌ ప్రారంభించి, సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌ సాగుతుందని, పోలింగ్‌ విధులు మనమంతా సమన్వయంతో సజావుగా సాగేలా పని చేద్దామని తిరుపతి ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి అదితి సింగ్‌ ఐఏఎస్‌ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల అవగాహన ట్రైనర్‌ చంద్రమౌళి, అడిషనల్‌ కమిషనర్‌ చరణ్‌ తేజ్‌ రెడ్డి, డిప్యూటీ కమిషనర్‌ అమరయ్య తదితరులు పాల్గొన్నారు.పింఛను పాట్లు

➡️