ఆపదలో ఉన్నవారికి ఆర్థిక సాయం

Mar 25,2024 15:02 #Tirupati district

ప్రజాశక్తి-కోట : అర్హులై ఉండి ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరికి తమ వంతు వెంకటగిరి సాహెబ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆర్థిక సాయం చేయడానికి కృషి చేస్తానని కోట ఎంపీటీసీ, సచివాలయాల మండల కోఆర్డినేటర్,వెంకటగిరి సాహెబ్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్,తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ మైనార్టీ సెల్ కార్యదర్శి షేక్.మొభీన్ భాష అన్నారు.ఈ సందర్భంగా సోమవారం కోట మండలంలోని శ్యామసుందరపురం గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ ఎస్ధాని భాష భార్య జరీనా అనారోగ్యంతో ఉండడంతో ఆపరేషన్ ఖర్చుల నిమిత్తం 5000 రూపాయలను ఆర్థిక సాయం అందించడం జరిగింది.అనంతరం షేక్.మొభీన్ భాష మాట్లాడుతూ గతంలో కూడా వెంకటగిరి సాహెబ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మరెన్నో సేవా కార్యక్రమాలు చేయడం జరిగిందని గుర్తు చేస్తూ అందులో భాగంగానే ఆటో డ్రైవర్ ఎస్ధాని భార్య జరీనాకు ఆర్థిక సాయం అందించామని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆటో డ్రైవర్ యూనియన్ సభ్యులు, ముస్లిం సోదరులు షరీఫ్ సాహెబ్,ఇలియాజ్ భాష అబ్దుల్లా,అమీర్ భాష, ఆన్సర్ భాష తదితరులు ఉన్నారు.

➡️