బిందెమీద బిందె పెట్టి..కిలోమీటర్ల దూరం నుంచి

బిందెమీద బిందె పెట్టి..కిలోమీటర్ల దూరం నుంచి

బిందెమీద బిందె పెట్టి..కిలోమీటర్ల దూరం నుంచిప్రజాశక్తి – బుచ్చినాయుడు కండ్రిగ వేసవి మండిపోతోంది.. నాలుక తడారిపోతోంది.. మండుటెండలో చల్లని నీరు తాగితే శరీరం చల్లబడుతుంది. అయితే బిఎన్‌ కండ్రిగ మండలంలో చివరి గ్రామంగా ఉన్న తిమ్మి గోపాలపురం తాగునీరు లేక అల్లాడే పరిస్థితి. ఈ గ్రామాన్నే టిజీపురం అనీ అంటారు. అధికారుల దృష్టికి అనేకమార్లు తీసుకెళ్లినా పట్టించుకోలేదన్న ఆవేదన వారిలో ఉంది. దీంతో తాగునీటి కోసం పేదలు గ్రామంలోని కిలోమీటర్‌ దూరంలోని క్వారి గుంతల నుంచి నీరు తెచ్చుకుంటున్నారు. గొంతెండుతోంది ఆదుకోండి అంటూ అధికారులను వేడుకొంటున్నారు. మండల అధికారులు స్పందించిన పాపాన పోలేదని వారు వాపోతున్నారు. ఫిర్యాదు చేసినా స్పందన లేకపోవడంతో, కిలోమీటర్ల దూరం నంచి నీటి మోత తప్పడం లేదని కన్నీరుమున్నీరవుతున్నారు.

➡️