గోవిందా..ఇదేమైనా బాగుందా..!

Apr 10,2024 22:56
గోవిందా..ఇదేమైనా బాగుందా..!

శ్రీ ఎండ తీవ్రతకు భక్తులు విలవిలశ్రీ మాడా వీధుల్లో కూల్‌ పెయింట్‌ ఏదిశ్రీ కాళ్లకు గోనెసంచులు కట్టుకున్న భక్తులుశ్రీ టీటీడీ అధికారుల తీరుపై విమర్శలుతిరుమలలో కొందరు భక్తులు కాళ్లకు గోనె సంచులు కట్టుకుని కనిపించారు. కొండపై ఎండ తీవ్రత విపరీతంగా పెరగడమే దీనికి కారణం. ఆలయ పరిసర ప్రాంతాల్లోని కాలిబాటలో కొన్నిచోట్ల కూల్‌ పెయింట్‌ వేయకపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.ఈ వేడి నుంచి పాదాలను కాపాడుకునేందుకు లడ్డూ ప్రసాద వితరణకు వినియోగించే గోనె సంచులను పాదాలకు ధరించి భక్తులు నడుస్తున్నారు. రానున్న రోజుల్లో ఎండలు మరింత తీవ్రంగా ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలోనే టీటీడీ వెంటనే చర్యలు తీసుకోవాలని భక్తులు డిమాండ్‌ చేస్తున్నారు.ప్రజాశక్తి -తిరుమల : తిరుమల అంటేనే ఆధ్యాత్మిక ప్రాంతం.. మాడావీధుల్లో చెప్పులు వేసుకుని తిరగరాదనే నిబంధన ఉంది.. అయితే ఆ విషయం సూరీడుకు తెలియదేమో మరి.. వాతావరణ మార్పుల నేపథ్యంలో కొండపైనా నిప్పులు కురిపిస్తున్నాడు.. దీంతో భక్తులు చెప్పులు వేసుకోలేక, గోనెసంచులు కట్టుకుని మాడావీధుల్లో తిరగడం కనిపించింది. శ్రీవారి సంచులు కాళ్లకు కట్టుకోవడం ఏంటన్న విమర్శలు వెల్తువెత్తినా, మాడా వీధుల్లో ఇంజినీరింగ్‌ శాఖ కూల్‌ పెయింట్‌ వేయకపోవడం వల్లనే భక్తులు ఎండను భరించలేకే అలా చేశారనే చర్చ సోషల్‌మీడియాలో నడుస్తోంది. ఏదిఏమైనా మండు వేసవిలో టిటిడి ఉన్నతాధికారులు భక్తులకు ఇబ్బందులు లేకుండా చూడాల్సి ఉండగా, అటువంటి చర్యలు తీసుకోకపోవడం వల్లనే భక్తుల ఇబ్బందులు వర్ణనాతీతం. ఏప్రిల్‌ మొదటివారంలోనే సూర్యుడు తన ప్రతాపాన్ని తీవ్రతరం చేశాడు. దేశవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో పలు జిల్లాలు నిప్పుల కుంపటిలా మారాయి. చిత్తూరు జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. ఇటు తిరుమలకొండపైన భానుడు భగభగమంటున్నాడు. వేసవి సెలవులకు తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తారు. వీరిలో కాలినడకన వెళ్లే భక్తులు కూడా ఉంటారు. రోజు రోజకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో కాలిబాటలు, మాడవీధులు కాలుతున్న పెనంలా

➡️