డిఆర్‌డిఓ విభాగం నుంచి మహిళా వర్సిటీకి నిధులు మంజూరు

డిఆర్‌డిఓ విభాగం నుంచి మహిళా వర్సిటీకి నిధులు మంజూరు

డిఆర్‌డిఓ విభాగం నుంచి మహిళా వర్సిటీకి నిధులు మంజూరుప్రజాశక్తి – క్యాంపస్‌ శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయానికి భారత రక్షణ మంత్రిత్వ శాఖ విభాగానికి చెందిన డిఆర్‌డిఓ విభాగం నుంచి రూ.40.20లక్షల విలువైన పరిశోధన మంజూరు చేయడం జరిగిందని ప్రాజెక్టు కోఆర్డినేటర్లు ఆచార్య పి.ఉమామహేశ్వరి దేవి డాక్టర్‌ వి.కళారాణి వెల్లడించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఒక ప్రతిష్టాత్మక జాతీయసంస్థ, రక్షణ మంత్రిత్వశాఖ, భారత ప్రభుత్వం నుంచి రూ.40.22లక్షల విలువైన పరిశోధన గ్రాంట్‌ను అందుకుందని అన్నారు. ఈ బహువిధ ప్రాజెక్ట్‌ ప్రొఫెసర్‌ పి.ఉమామహేశ్వరి దేవి, డాక్టర్‌ వి.కళారాణిలకు మంజూరు చేయబడింది. ఈసందర్భంగా ఆచార్య ఎన్‌.రజిని ఆచార్య ఆర్‌.ఉష మాట్లాడుతూ ఆహార సంరక్షణను ప్రోత్సహించడానికి నోవల్‌ నేచురల్‌ యాంటీమైక్రోబయాల్స్‌ను అభివద్ధి చేయడానికి వినియోగించడం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా వైస్‌ ఛాన్సలర్‌ ప్రొఫెసర్‌ డి.భారతి రీసెర్చ్‌ గ్రాంట్‌ తీసుకురావడంలో కషి చేసినందుకు అధ్యాపక బందాన్ని అభినందించారు.

➡️