ఇండియా కూటమి అభ్యర్థి మురళి విస్తృత ప్రచారం

ఇండియా కూటమి అభ్యర్థి మురళి విస్తృత ప్రచారం

ఇండియా కూటమి అభ్యర్థి మురళి విస్తృత ప్రచారంప్రజాశక్తి- తిరుపతి సిటీ:ఇండియా కూటమి తరపున సిపిఎం, కాంగ్రెస్‌ పార్టీలు బలపరిచిన సిపిఐ అభ్యర్థి పి.మురళి గెలుపు కోసం ఆదివారం ఉదయం ఏడు గంటల నుంచి ప్రారంభమైన ప్రచారం దళాలుగా కొల్లగుంట ప్రాంతంలో ఇంటింటికి వెళ్లి కరపత్రాలు పంపిణీ చేసి, చిన్నచిన్న సభలు నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు హరినాథ్‌ రెడ్డి, ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు రవీంద్రనాథ్‌ మాట్లాడుతూ తిరుపతి చాలా పవిత్ర పుణ్యక్షేత్రం అని, వేలాది మంది భక్తులు, ప్రపంచ వ్యాప్తంగా తిరుపతికి వస్తుంటారని, అటువంటి తిరుపతి పవిత్రతను కాపాడాలన్నా, అవినీతిరహిత పాలన సాగాలన్న భూకబ్జాలు దౌర్జన్యాలు అవినీతిలేని తిరుపతి సుందర నిర్మాణం జరగాలన్న సిపిఐ అభ్యర్థి మురళి గెలుపుతోనే సాధ్యమవుతుందని అన్నారు. తిరుపతి నగరంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వేసే పన్నులతో పాటుగా కార్పొరేటర్‌ పన్ను , ఎమ్మెల్యే పన్ను, మేయర్‌ పన్నుల పేరుతో దందాలు కొనసాగుతున్నాయని అన్నారు. ఆర్టీసీ బస్టాండ్‌ దగ్గర ఆటో నడుపు కోవాలన్నా, తోపుడు బండి పెట్టుకోవాలన్న రోజువారి లంచాలు చెల్లించాల్సిన పరిస్థితి ఉందన్నారు. కార్మికులకు స్థానిక ప్రజలకు భరోసా కావాలంటే తిరుపతిలో మురళి గెలుపుతోనే సాధ్యమవుతుందని ఆలోచన చేసి ఓటు వేయాలని కోరారు. సిపిఐ నాయకులు పెంచలయ్య, ఎన్‌డి.రవి, శ్రీరాములు, ప్రభాకర్‌, శశి కుమార్‌, సిహెచ్‌ శివకుమార్‌, సిపిఎం నాయకులు లక్ష్మీ, వేణు, బుజ్జి, సుజాతమ్మ, రుక్కు, గుర్రప్ప, నాగరాజు పాల్గొన్నారు.

➡️