వడదెబ్బకు వృద్ధురాలు మృతి

వడదెబ్బకు వృద్ధురాలు మృతిప్రజాశక్తి -కే వి బి పురంకేవిబి పురం. మండలంలోని కోట మంగాపురం గ్రామానికి చెందిన ఎం. కన్నెమ్మ (70) పింఛన్‌ కోసం వెళ్లి వడదెబ్బకు గురై మృతిచెందింది. ఆమె పింఛన్‌ బ్యాంకులో జమ చేశారని చెప్పడంతో తీసుకునేందుకు మండుటెండలో పిచ్చాటూరుకు వెళ్లి బ్యాంకులో చూసింది. అయితే ఈ నెంబర్కు పింఛన్‌ డబ్బులు పడలేదని చెప్పడంతో రెండు రోజులు పాలమంగళం బ్యాంకు వద్దకు వెళ్లి వస్తుండగా మార్గమధ్యంలో ఎండ తీవ్రతకు తట్టుకోలేక ఆమె మృతి చెందిందని గ్రామస్తులు వాపోయారు.

➡️