బకాయిలు విడుదల చేయ్ మావయ్య

Mar 6,2024 17:32 #tirupathi

 ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు, విద్యా దీవెన బకాయిలపై  ఎస్ఎఫ్ఐ నిరసన 

ప్రజాశక్తి – క్యాంపస్ : విద్యార్థుల చదువులకు నేను గ్యారంటీ అంటూ చెప్పిన సీఎం జగన్ మోహన్ రెడ్డి కేవలం బటన్ నొక్కుతూ ఫీజులు జమ చేస్తున్నాం.. అని ప్రచారం తప్ప ఇప్పటి వరకు లక్షల మంది విద్యార్థుల తల్లుల అకౌంట్ లో ఫీజులు జమ కాలేదని, ఫీజు బకాయిలు ఎలక్షన్స్ నోటిఫికేషన్ లోపు విడుదల చేయాలని ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో తిరుపతిలోని భవానినగర్ సర్కిల్ లో విద్యార్థులతో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి భగత్ రవి మాట్లాడుతూ మొన్ననే బటన్ నొక్కం అని గొప్పలు చెప్పుకునే వైసీపీ ప్రభుత్వం అన్ని కళాశాల విద్యార్థుల తల్లి అకౌంట్ లలో మాత్రం ఖాళీ అకౌంట్ లు దర్శనం ఇస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి మోసపు ప్రచార ఆర్బటాలు మానుకొని విద్యార్థులుకు రావలసిన న్యాయమైన ఫీజు బకాయిలు విడుదల చేయాలనీ డిమాండ్ చేశారు. ఫీజులు బకాయిలు వల్ల విద్యార్థులు కళాశాల యాజమాన్యంకు ఫీజులు చెల్లించలేక, వారికీ పాఠాలు చెప్పే వారికీ జీతాలు ఇవ్వక గందరగోళం ఏర్పడి తలలు పట్టుకొని కళాశాల యాజమాన్యలు కూర్చున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు అక్బర్ మాట్లాడుతూ పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు అండగా మీ జగన్ మామయ్య ఉన్నారని గొప్పలు చెప్పుకుంటూ ఫీజులు కోట్ల రూపాయలు బకాయిలు ఇవ్వకుండా జగన్ మామయ్య మోసం చేస్తున్నారని మండిపడ్డారు. ఫీజు బకాయిలు ఇవ్వకుంటే విద్యార్థులు ఇంటికి పంపడానికి సిద్ధం అని అన్నారు. తక్షణమే ఫీజు బకాయిలను విడుదల చేయాలనీ లేని పక్షంలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఉదృత పోరాటాలు నిర్వహిస్తామని రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు అశోక్, తేజ, నగర నాయకులు శివ, బాల, హార్శద్, సుభాన్ తదితరులు పాల్గొన్నారు.

➡️