సామాజిక పింఛన్లు నేరుగా అకౌంట్లకుతిరుపతి ఎంపి పరిధిలో 23 మందిఎవరూ సచివాలయాలకు వెళ్లొద్దు : కలెక్టర్లుఆధార్‌ అనుసంధానం కాకపోతే ఇంటివద్దకేమూడు రోజుల్లోనే 100శాతం పూర్తి చేస్తాం

సామాజిక పింఛన్లు నేరుగా అకౌంట్లకుతిరుపతి ఎంపి పరిధిలో 23 మందిఎవరూ సచివాలయాలకు వెళ్లొద్దు : కలెక్టర్లుఆధార్‌ అనుసంధానం కాకపోతే ఇంటివద్దకేమూడు రోజుల్లోనే 100శాతం పూర్తి చేస్తాం

సామాజిక పింఛన్లు నేరుగా అకౌంట్లకుతిరుపతి ఎంపి పరిధిలో 23 మందిఎవరూ సచివాలయాలకు వెళ్లొద్దు : కలెక్టర్లుఆధార్‌ అనుసంధానం కాకపోతే ఇంటివద్దకేమూడు రోజుల్లోనే 100శాతం పూర్తి చేస్తాంప్రజాశక్తి – చిత్తూరు అర్బన్‌, తిరుపతి టౌన్‌ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వద్ధులు, దివ్యాంగుల సంక్షేమం దష్ట్యా మే నెల సామాజిక పింఛన్లను బ్యాంక్‌ అకౌంట్లు ఉన్న లబ్దిదారులకు డిబిటి ద్వారా వారి వ్యక్తిగత బ్యాంకు ఖాతాలకు నేరుగా జమ చేస్తామని చిత్తూరు జిల్లా కలెక్టర్‌ ఎస్‌.షణ్మోహన్‌ తెలిపారు. సోమవారం జిల్లా సచివాలయంలోని సమావేశ మందిరంలో జిల్లాలో మే నెల సామాజిక పెన్షన్ల పంపిణీ పై, ఎలక్షన్‌ అప్డేట్స్‌ పై మీడియాతో మాట్లాడారు. అధిక ఉష్ణోగ్రతల కారణంగా వద్ధులు, దివ్యాంగుల సంక్షేమాన్ని దష్టిలో ఉంచుకుని వారికి సహాయపడే విధంగా సచివాలయాలకు రానవసరం లేకుండా ఆధార్‌ నెంబర్‌తో లింక్‌ అయిన బ్యాంక్‌ అకౌంట్లకు పెన్షన్‌లను డిబిటి పద్ధతి ద్వారా నేరుగా జమ చేసేలా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలిపారు. చిత్తూరు జిల్లాలో వివిధ పెన్షన్ల కింద మే నెలలో 2,72,864 మంది లబ్దిదారులకు రూ.79.87 కోట్లు పంపిణీ చేయాల్సి ఉండగా, 1,92,021 లబ్దిదారుల బ్యాంక్‌ అకౌంట్లు ఆధార్‌ నెంబర్‌తో లింక్‌ అయి ఉన్నాయని, వీరికి డిబిటి ద్వారా మే ఒకటో తేదిన పెన్షన్‌ నగదు జమ చేస్తామన్నారు. మిగిలిన 80,843 మందికి సైతం మే 01 వ తేదీనే సచివాలయ సిబ్బంది ద్వారా ఇంటి వద్దకే వెళ్లి పెన్షన్‌ పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. ఈ పంపిణీ కార్యక్రమం ఎంపిడిఓల ఆధ్వర్యంలో నిర్దేశించిన సచివాలయ పరిధిలో ఆయా సచివాలయ సిబ్బంది ద్వారా చేపట్టడం జరుగుతుందన్నారు. లబ్దిదారులకు ఒకటి కంటే అధికంగా బ్యాంక్‌ అకౌంట్లు ఉన్న నేపథ్యంలో వారికి పెన్షన్‌ నగదు జమ చేసిన అనంతరం సంబంధిత బ్యాంక్‌ నుండి టెక్స్ట్‌ మెసేజ్‌ లు అందుతాయని, అలా మెసేజ్‌ లు అందని నేపథ్యంలో సచివాలయాల వద్దకు వెళ్లి వివరాలు తెలుసుకునే ఏర్పాటు చేయడం జరుగు తుందన్నారు. నగదు పంపిణీలో సాంకేతిక కారణాల ద్వారా బ్యాంక్‌ అకౌంట్ల కు నగదు జమ కాని పక్షంలో మే 1 వ తేది తరువాత లబ్దిదారుల ఇంటి వద్దకు వెళ్లి నగదు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. పెన్షన్‌ నగదు విత్‌ డ్రా చేసుకోవడానికి బ్యాంక్‌ల వద్ద ప్రత్యేక కౌంటర్‌లు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. మే 2 న బ్యాంక్‌ ఉద్యోగులకు ఎన్నికల విధుల పై శిక్షణ కు హాజరు కానున్న సందర్భంగా వారు బ్యాంక్‌ ల వద్ద అందుబాటులో ఉండక పోవచ్చునని, మే 3 వ తేదీన పూర్తి అందుబాటులో ఉంటారని ఈ విషయాన్ని లబ్దిదారులు గమనించాలని తెలిపారు. పెన్షన్‌ల పంపిణీ పై పూర్తి పర్యవేక్షణ ఉంటుందని, వీలైనంత త్వరగా పెన్షన్‌ ల పంపిణీ పూర్తి చేయడం జరుగుతుందన్నారు. పెన్షన్‌ ల పంపిణీ లో ఎటువంటి సమస్యలు, అవాంచనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుందన్నారు. 14న గంగజాతర చాటింపు సాధారణ ఎన్నికలు -2024 నేపథ్యంలో చిత్తూరు పట్టణంలో గంగా జాతర కు మే 14 న చాటింపు, మే 21, 22 న గంగ జాతర నిర్వహణ ఉంటుందని ఈ విషయాన్ని పట్టణ వాసులు, భక్తులు గమనించాలని తెలిపారు. పక్కాగా సామాజిక పింఛన్ల పంపిణీ : కమిషనర్‌ నగరపాలక పరిధిలో మే నెలకు సంబంధించి సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం పక్కాగా పంపిణీ చేయాలని, ఇందుకోసం వార్డు సచివాలయం స్థాయిలో యాక్షన్‌ ప్లాన్‌ సిద్ధం చేయాలని నగర కమిషనర్‌ డా. జె అరుణ చెప్పారు. నగరపాలక పరిధిలో మొత్తం 16,627 పెన్షన్లు ఉండగా.. ఇందులో 11,587 పింఛన్లు డీబీటీ ద్వారా, 5,040 పింఛన్లు డోర్‌ టు డోర్‌ అందించనున్నట్లు తెలిపారు. ఎవరెవరికి ఏ విధానంలో పంపిణీ చేయాలనే జాబితా క్లస్టర్‌ వారీగా ఉందని, ఈ జాబితా ప్రకారం లబ్ధిదారులకు కాల్‌ చేసి వివరాలు తెలియజేసి వారు ఎలాంటి ఆందోళన లేకుండా పింఛన్లు పొందేలా చూడాలన్నారు. సచివాలయల్లో పింఛన్ల జాబితాను ప్రదర్శించాలన్నారు. పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని పర్యవేక్షించడానికి ప్రతి 10 వార్డులకు ఒక సూపర్వైజర్‌ అధికారిని నియమించారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేయాలని చెప్పారు. కార్యక్రమంలో సీఎంఎం గోపి, సీవోలు పాల్గొన్నారు.పెన్షన్‌దారులు సచివాలయాలకు రావొద్దు : కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌మే ఒకటో తేదీ నుంచి సామాజిక పింఛన్లను ఇంటి వద్దనే జమ చేస్తామని, ఎవరూ సచివాలయాలకు రావొద్దని కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ తెలిపారు. అకౌంట్లు ఆధార్‌తో అనుసంధానం కాకుంటే డైరెక్టుగా సచివాలయ సిబ్బంది ఇంటివద్దకే తెచ్చి ఇస్తారని తెలిపారు. ఈనెల 30నే పింఛన్‌ నగదును విత్‌డ్రా చేసుకుని సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. వంద శాతం పింఛన్ల పంపిణీ మూడు రోజుల్లో పూర్తి కావాలని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో పథక సంచాలుకులు డి.ఆర్‌.డి.ఎ ప్రభావతి, డి.ఎల్‌.డి.ఓ.లు సుశీల దేవి, ఆదిశేషా రెడ్డి పాల్గొన్నారు.తిరుపతి నగరంలో వద్ధాప్యం వలన మంచానికే పరిమితమైన, దివ్యాంగులు, డయాలసిస్‌, తలసేమియా ఫించనుదారులు మొత్తము 5215 మందికి సచివాలయ సిబ్బంది ద్వారా మే నెల 1వ తారీఖున ఇంటి వద్దకే ఫించను ఇవ్వడం జరుగుతుందని, అలాగే మిగిలిన 14,242 మంది ఫించనుదారులకు వారి యొక్క ఆధార్‌ నెంబర్‌ కు అనుసంధానం అయిన ఖాతాకు జమ చేయడం జరుగుతుందని తిరుపతి మునిసిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌ అదితి సింగ్‌ ఐఏఎస్‌ సోమవారం ఓక ప్రకటనలో తెలియజేసారు. కావున పై విషయాన్ని గమనించి ఫించనుదారులు సచివాలయం వద్దకు ఎవ్వరూ వెళ్ళరాదని, ఒకవేళ ఫించనుదారు బ్యాంకు ఖాతాకు ఫించను నగదు జమకాని ఎడల సంబంధిత సచివాలయ సిబ్బంది 2, 3 తేదీలలో మీ ఇంటి వద్దకే వచ్చి ఫించను నగదు పంపిణీ చేయడం జరుగుతుందని కమిషనర్‌ తెలిపారు. ఈనెల 1-5 తేదీల్లో పింఛన్లు పంపిణీ చేస్తామని గూడూరు పురపాలక కమిషనర్‌ వెంకటేశ్వర్లు తెలిపారు. మే 1 నుంచి 5వ తేదీలోగా బ్యాంక్‌ ఖాతా, ఇంటి వద్దకే పింఛన్లు అందిస్తామని శ్రీకాళమస్తి ఎం.పీ.డీ.వో పటాన్‌ రఫీ ఖాన్‌ ప్రకటనలో తెలిపారు. మండలంలో మొత్తం 9172 మంది పెన్షన్‌ లబ్ధిదారులు ఉన్నారని, వారిలో బ్యాంక్‌ ఖాతా ద్వారా పెన్షన్‌ అందుకునే లబ్ధిదారులు 6609 మంది, ఇంటి వద్దనే పెన్షన్‌ అందుకునే లబ్ధిదారులు 2563 మంది ఉన్నారని తెలిపారు.

➡️