శాంతి భద్రతలపై ప్రత్యేక దృష్టి సారించండి 

May 27,2024 14:14 #Tirupati district
  • ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశం 
  • ఆర్సీపురం పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన ఎస్పీ

ప్రజాశక్తి-రామచంద్రపురం : సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా మండల పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణపై ప్రత్యేక దృష్టి సారించాలని తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆర్ సి పురం పోలీసులను ఆదేశించారు. సోమవారం తిరుపతి జిల్లా రామచంద్రపురం మండల పోలీస్ స్టేషన్ ఆకస్మికంగా ఆయన తనిఖీ చేశారు. మండల పరిధిలోని గ్రామాలలో కార్డెన్ సెర్చ్, పోలీస్ కవాతు, నాకాబందీలు నిర్వహించి, హింసాత్మక ఘటనలకు పాల్పడే వ్యక్తులను పై చర్యలు తీసుకోవాలన్నారు. మండలంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు, హింసాత్మక దాడులు జరగనీయకుండా చర్యలు తీసుకోవాలని పోలీసులకు హితబోధ చేశారు. రౌడీ షీటర్లకు, ట్రబుల్ మాంగర్కు కౌన్సిలింగ్ ఇవ్వాలన్నారు. దాడులకు ప్రేరేపించే వ్యక్తులను గుర్తించి బైండోవర్ కేసులు నమోదు చేయాలని ఎస్ఐకి ప్రత్యేక ఆదేశాలు ఇచ్చారు. పోలీస్ స్టేషన్లో ఎంతమంది సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారనే వివరాలను తెలుసుకొని ఎందుకు తక్కువ సిబ్బంది ఉన్నారని ఎస్ఐలు అడిగి తెలుసుకున్నారు. సిబ్బందిని పెంచేందుకు చర్యలు తీసుకుంటామని మీడియాకు తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ గురు శేఖర్, చంద్రగిరి డిఎస్పి శరత్ రాజ్కుమార్, ఎస్సై చిరంజీవి, హెడ్ కానిస్టేబుల్స్ సురేషు, రమణయ్య, స్పెషల్ బ్రాంచ్ హెడ్ కానిస్టేబుల్ మదన్మోహన్, త్యాగరాజులు, అబ్రహం, దివ్య తదితరులు పాల్గొన్నారు.

➡️