‘చిక్పేట్‌ దొన్ని బిర్యాని’ ప్రారంభం

'చిక్పేట్‌ దొన్ని బిర్యాని' ప్రారంభం

‘చిక్పేట్‌ దొన్ని బిర్యాని’ ప్రారంభం ప్రజాశక్తి- తిరుపతి సిటీ:తిరుపతిలో నూతనంగా ఏర్పాటు చేసిన చిక్పేట్‌ దొన్ని బిర్యానీని ప్రముఖ తెలుగు సినీహీరో శివాజీ ప్రారంభించారు. స్థానిక శివజ్యోతినగర్‌ వద్ద, రత్నం స్కూల్‌ సమీపంలో ఏర్పాటు చేసిన రెస్టారెంట్‌ను ఆదివారం ప్రారంభించిన సినీహీరో శివాజీ, అనంతరం దొన్ని బిర్యానీని రుచి చూసి కితాబ్‌ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆ సంస్థ అధినేతలు కళ్యాణ్‌, రితిన్‌ సాయి, కావ్య మీడియాతో మాట్లాడుతూ కర్ణాటక రాష్ట్రం బెంగళూరులో చాలా ప్రసిద్ధిగాంచిందని అన్నారు. చిట్టి ముత్యాలు బియ్యాలతో చేసే ఈ బిరియాని ఎంతో రుచికరం, ఆరోగ్యకరమైనదని తెలిపారు. బెంగళూరులో ప్రసిద్ధి చెందిన ఈ బిరియాని తిరుపతి వాసులకు పరిచయం చేయాలని, మొట్టమొదటిసారిగా తిరుపతి నగరంలో చిక్కుపేట్‌ చికెన్‌ బిర్యాని అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. చికెన్‌, మటన్‌, చేపలు వంటి మాంసాహారాలతో కూడిన అనేక రకాలైన ఆహార పదార్థాలు రుచికరంగా ఇక్కడ లభిస్తాయన్నారు. దొన్ని బిర్యాని వినియోగం చాలా ఆరోగ్యకరమన్నారు. రుచికరమైన చికెన్‌ బిరియాని రూ.190, మటన్‌ బిర్యానీ రూ.309 వంటి సరసమైన ధరలకు లభిస్తాయని తెలిపారు. దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో డాలర్స్‌ దివాకర్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మోహన్‌, జైబి శ్రీనివాస్‌, వేణు, రాజేష్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️