అంగన్వాడీలకు వేతనాలు వెంటనే పెంచాలి

  • సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి డిమాండ్‌

ప్రజాశక్తి- పుత్తూరుటౌన్‌(తిరుపతి) : పట్టణంలోని స్థానిక పుత్తూరు మండల తహశీల్దార్‌ కార్యాలయం ఎదుట అంగన్వాడి వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ సిఐటియు ఆధ్వర్యంలో 12వ రోజు సమ్మెలో భాగంగా రిలే నిరాహార దీక్షలను సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీల సమస్య పరిష్కరించడంలో విఫలమైందని ఆరోపించారు. అంగన్వాడీ వర్కర్ల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఉష గారు అంగన్వాడి సమస్యలు పరిష్కరిస్తామని మాయమాటలు చెప్పి తప్పించుకుంటున్నారని అన్నారు. ఇక్కడ ఉన్నటువంటి మంత్రివర్యులు ఆర్కే రోజా గారు మా అంగన్వాడి గోడును జగన్మోహన్‌ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. అనంతరం సిపిఐ జిల్లా కార్యదర్శి పి.మురళి మాట్లాడుతూ ఈనెల 26 తేదీ లోపల అంగన్వాడి సంస్థలు పరిష్కరించకపోతే అన్ని రాజకీయ పార్టీలతో పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి వెంకటేష్‌, పురుషోత్తం, కేఆర్‌ సుబ్రహ్మణ్య పిల్లాయి, ఏ.విజరు, యాసిన్‌ భాష, రమేష్‌, అంగన్వాడీ నాయకులు, ముని కుమారి, విజరు కుమారి, ధనమ్మ, రాధా, లలిత, అన్నపూర్ణ, మోహన్‌ లక్ష్మి, హైమావతి, గంగులమ్మ సిపిఐ పట్టణ కార్యదర్శి డి మహేష్‌, గోపి, కృష్ణారెడ్డి, ముకుంద, సెల్వరాజ్‌ ఆచారి తదితరులు పాల్గొన్నారు.

➡️