నేడే పోస్టల్‌ బ్యాలెట్‌కు తుది అవకాశం

నేడే పోస్టల్‌ బ్యాలెట్‌కు తుది అవకాశం

నేడే పోస్టల్‌ బ్యాలెట్‌కు తుది అవకాశంప్రజాశక్తి – చిత్తూరు అర్బన్‌ పోస్టల్‌ బ్యాలెట్‌ సౌకర్యాన్ని వినియోగించుకునేందుకు ఆఖరి అవకాశం కల్పిస్తున్నట్లు చిత్తూరు జిల్లా ఎన్నికల అధికారి ఎస్‌.షన్మోహన్‌ ఓ ప్రకటనలో తెలిపారు. సార్వత్రిక ఎన్నికలు – 2024 కి సంబంధించి ఎన్నికల విధులకు కేటాయించిన అధికారులు, సిబ్బందికి జిల్లాలో ఓటు హక్కు ఉన్నట్లయితే వారి ఓటు హక్కును వినియోగించు కునేందుకు పూరించిన ఫారం -12 (పోస్టల్‌ బ్యాలెట్‌) ను ఈ నెల 23వ తేదీ లోపు హెచ్‌ఓడి లు జిల్లా కలెక్టర్‌ కు అందజేయాలన్నారు. ఈనెల 22 వరకు ఉన్న అవకాశాన్ని మరో రోజు పొడిగించి 23 వ తేదీ వరకు అవకాశం ఇచ్చినట్లు తెలిపారు. అత్యవసర సేవలు అందించే విభాగాలకు చెందిన అధికారులు సిబ్బంది ఫారం 12- (డి) ని పూరించి అందజేయాలన్నారు. ఇతర జిల్లాలకు చెందిన అధికారులు, సిబ్బంది జిల్లాలో విధులు నిర్వహిస్తుంటే ఫారం -12, అనెగ్జర్‌ (ఇ)ను సమర్పించాలన్నారు.

➡️