పోలీస్‌ తీరుపై విఎన్‌ఆర్‌ ఆగ్రహం

పోలీస్‌ తీరుపై విఎన్‌ఆర్‌ ఆగ్రహం

పోలీస్‌ తీరుపై విఎన్‌ఆర్‌ ఆగ్రహంప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌: ఓటర్లను ప్రలోభపెడుతున్న వారిని పట్టిచ్చినా పోలీసులు వదిలేస్తున్నారంటూ వైసిపి అభ్యర్థి విజయానందరెడ్డి ఆదివారం స్థానిక వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ ఎదుట అర్ధనంగా నిరసన వ్యక్తం చేశారు. వైఎన్‌ఆర్‌కు మద్దతులుగా వైసిపి నాయకులు కార్యకర్తలు నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బయటి నుండీ వచ్చిన వ్యక్తులు చిత్తూరు నియోజకవర్గంలో మద్యం, డబ్బులు విచ్చలవిడిగా పంపిణీ చేస్తూ ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నారని సాక్షాత్తూ తానే పోలీస్‌ టాప్‌లైన్‌లో పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్న వారి నగదుతో సహా పోలీసులకు అప్పగిస్తే గంట వ్యవధిలో వదిలిపెట్టడం ఏమిటని ప్రశ్నంచారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చి ఓటర్లను ప్రలోభాలకు గురి చేసే వారిపై పోలీసులు కేసులునమోదు చేయాలని కోరారు. చిత్తూరు డిఎస్పీ, సిఐ సద్దిచెప్పడంతో ఆందోళన విరమించారు.

➡️