మహిళలకు ఉత్తమ సేవ పురస్కారాలు

Mar 8,2024 17:45 #Tirupati district
  • యుటిఎఫ్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు 

ప్రజాశక్తి-సూళ్లూరుపేట(తిరుపతి) : సూళ్లూరుపేట జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల నందు అంతర్జాతీయ మహిళా దినోత్సవం యుటిఎఫ్ జిల్లా మహిళా కమిటీ కన్వీనర్ కే.ఎం.ఎస్.సునీల అధ్యక్షతన శుక్రవారం జరిగింది.యుటిఎఫ్, జనవిజ్ఞాన వేదిక, సిఐటియు  తడ, సూళ్లూరుపేట, దొరవారి సత్రం మండల శాఖల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మహిళలకు వివిధ ఆటల పోటీలు నిర్వహించారు. అనంతరం బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా వారి వారి రంగాలలో విశిష్ట సేవలు అందించిన మహిళలకు ఉత్తమ సేవ పురస్కారాలు అందించారు. ఈ సమావేశానికి మాజీ ఎమ్మెల్సీ విటపు బాలసుబ్రమణ్యం విశిష్ట అతిథిగా విచ్చేసి సందేశం ఇచ్చారు. మాజీ రాష్ట్ర కార్యదర్శి సి.చంద్రశేఖర్, తిరుపతి జిల్లా ఐద్వా నాయకురాలు డాక్టర్ సాయి లక్ష్మి,యుటిఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దేవరాల నిర్మల, యుటిఎఫ్ జిల్లా గౌరవ అధ్యక్షుడు కే.శేఖర్,జిల్లా అధ్యక్షుడు జి.జె.రాజశేఖర్, ప్రధాన కార్యదర్శి కే.ముత్యాల రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఎస్. నాయుడు,సహ అధ్యక్షులు కందల శ్రీదేవి, జిల్లా జన విజ్ఞాన వేదిక అధ్యక్షుడు ఎస్.చెంగయ్య, సిఐటియు సూళ్లూరుపేట మండల కార్యదర్శి కె.లక్ష్మయ్య, ఏపీఎస్ఆర్టీసీ ఎస్ డబ్ల్యూ ఎఫ్. మహిళా కమిటీ నాయకురాలు వి.భాగ్యలక్ష్మి, ఆశా వర్కర్ల సంఘం నాయకురాలు లక్ష్మి, జిల్లా శ్రామిక మహిళ కన్వీనర్ ఆర్.లక్ష్మి మొదలగు నాయకులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

➡️